China Weapons: ఆయుద సంపత్తి వారిదే ఎక్కువా?

ఆయుద సంపత్తి విషయంలో భారత్ కంటే పాక్ వద్దే ఎక్కువ ఉన్నట్టు ది స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది.

Update: 2020-06-17 03:20 GMT

ఆయుద సంపత్తి విషయంలో భారత్ కంటే పాక్ వద్దే ఎక్కువ ఉన్నట్టు ది స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది. ఇది విడుదల చేసిన వివరాల ప్రకారం అన్ని దేశాలకు సంబంధించి ఆయుధ సంపత్తిపై లెక్కలు వేసి తాజాగా ఒక పుస్తకాన్ని విడుదల చేసింది.

ఆయుధ సంపత్తిలో పాక్‌ కంటే భారత్‌ ముందంజలో ఉందని.. ఇన్నాళ్లు అంతా అనుకున్నారు. అయితే స్వీడన్‌కు చెందిన ఓ రిపోర్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. భారత్‌ కంటే.. పాక్‌ చైనాల వద్ద ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నాయని తెలింది. ది స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(SIPRI) ఈ వివరాలను ప్రకటించింది. SIPRI విడుదల చేసిన 2020 ఈయర్ బుక్ ప్రకారం.. భారత్‌ కంటే.. పాక్, చైనాల వద్ద ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నాయని.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 9 దేశాల వద్ద అణ్వాయుధాలున్నాయని ప్రకటించింది.

అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, చైనా, భారత్​, పాకిస్థాన్‌, ఇజ్రాయెల్‌, ఉత్తర కొరియా దేశాల దగ్గర పెద్ద సంఖ్యలో ఉన్నాయని.. ఈ ఏడాది ప్రారంభం నాటికి.. ఈ 9 దేశాల వద్ద మొత్తం 13,400 అణ్వాయుధాలు ఉన్నాయని ఓ అంచనా వేసింది. అయితే వీటిలో 320 న్యూక్లియర్ వార్‌హెడ్స్‌ చైనా వద్ద ఉండగా.. పాక్‌ వద్ద 160 ఉన్నాయని తెలిపింది. అదే సమయంలో మన భారత్‌ వద్ద 150 ఉన్నాయని వెల్లడించింది. గత కొద్ది రోజులుగా చైనా, భారత్‌ల మధ్య తలెత్తిన లడాక్ వివాదం నేపథ్యంలో ఈ అణ్వాయుధాల గురించిన వివరాలను ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో పాక్‌, చైనాలనుద్దేశించి భారత్‌ న్యూక్లియర్ వార్‌హెడ్స్‌ వివరాలు ఆరా తీయడం ఆసక్తిరేపుతోంది.

మరోవైపు సోమవారం రాత్రి చైనా, భారత్‌ సైనికుల మధ్య ఘర్షణ తలెత్తడం.. ఈ ఘటనలో భారత్‌కు చెందిన ఓ కల్నల్‌ అధికారితో పాటు మరో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. అటు చైనాకు చెందిన ఐదుగురు సైనికులు మరణించినట్లు చైనా ప్రకటించింది. అంతేకాదు.. మరో ఎనిమిది మంది గాయపడ్డారని తెలిపింది.


Tags:    

Similar News