Online Classes: చిన్నారులపై ఆన్‌లైన్‌ క్లాసుల ఎఫెక్ట్‌

Online Classes: గంటల కొద్ది ఫోన్ల ద్వార ఆన్‌లైన్‌ క్లాసులు * కంటిచూపుపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌

Update: 2021-08-12 04:58 GMT

ఆన్లైన్ తరగతులు (ఫైల్ ఇమేజ్)

Online Classes: కరోనా మహమ్మారి ఎఫెక్ట్ స్కూల్ చిన్నారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కోవిడ్ కారణంగా ఇప్పుడు చదువులన్ని ఆన్ లైన్ అవ్వడంతో టీవీలకు, ఫోన్‌లకు అతుక్కు పోయారు విద్యార్థులు. చదువులకు దూరం అవ్వద్దు అంటూ చేసిన ఈ ప్రయత్నం కాస్త చిన్నారుల భవిష్యత్‌ను అంధకారం చేస్తుంది. ఊహించని ఎన్నో అనారోగ్యాలకు కారణం అవుతోంది.

ఆన్‌లైన్‌ క్లాసుల పుణ్యమా అని రోజంతా స్క్రీన్లకే అంకితమైపోతున్నారు పిల్లలు. ఇప్పుడిదే ప్రమాద గంటికలు మోగిస్తోంది. ఆన్‌‌లైన్ క్లాసుల ప్రభావం పిల్లల కంటిచూపుపై తీవ్రంగా పడుతుంది. గంటల కొద్దీ నిరంతరం ల్యాప్ టాప్, సెల్ ఫోన్లలో క్లాసెస్ వినడం, చూడటం వల్ల కళ్ల మంటలు, తలనొప్పి, నిద్ర లేమి సమస్యలతో పాటు, కంటి చూపుపై ఎఫెక్ట్ పడుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఆన్ లైన్ క్లాసులతో పిల్లలు ఫిజికల్ ఫిట్ నెస్ కోల్పోయి అనారోగ్యంతో బాధపడుతున్నరని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక చిన్నారులకు ఔట్‌డోర్ గేమ్స్ సైతం లేకపోవడంతో ఊబకాయం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్.

పలు ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యం గంటలకొద్ది ఆన్ లైన్‌లో చదవిస్తున్నారు. దీంతో విద్యార్థులు మెడ నొప్పులతో పాటు భుజాలు, నడుము నొప్పులతో ఇబ్బందులు పడుతున్నారు. ఇంకొందరు పిల్లలు మానసిక ఇబ్బందులు పడుతున్నందున తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. అవసరాన్ని బట్టి రోజులో ఒకటిన్నర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా ఫోన్ చూడనివ్వొద్దుని వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ హెల్త్‌‌ మీద ఎఫెక్ట్ చూపిస్తోంది.

Full View


Tags:    

Similar News