Chhattisgarh Exit Poll 2023: ఛత్తీస్‌గఢ్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
Chhattisgarh Exit Poll 2023: వివిధ సర్వే సంస్థలు నిర్వహించిన ఛత్తీస్‌గఢ్ ఎగ్జిట్‌పోల్స్ రిలీజ్ అయ్యాయి.
Chhattisgarh Exit Poll 2023: ఛత్తీస్‌గఢ్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
Chhattisgarh Exit Poll: ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ జయకేతనం ఎగరవేసే అవకాశం ఉందని ఎగ్జిట్పోల్స్ఫలితాలు తేల్చి చెప్పాయి. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి.. హస్తం పార్టీ రెండోసారి అధికారంలోకి వస్తుందని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. మొత్తం 90స్థానాలు ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో.. అధికార కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలవొచ్చని వెల్లడించాయి. కాంగ్రెస్ 49 నుంచి 65 చోట్ల గెలిచి ఛత్తీస్‌గడ్‌లో తిరిగి అధికారం నిలబెట్టుకుంటుందని టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది.
బీజేపీకి 25 నుంచి 41 స్థానాలు, ఇతరులు 3 చోట్ల విజయం సాధించవచ్చని పేర్కొంది. ఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ 41 నుంచి 53 స్థానాలు గెలుస్తుందని తేలింది. బీజేపీకి 36 నుంచి 48 స్థానాలు రావొచ్చని, ఇతరులు 4 చోట్ల గెలుస్తారని అంచనా వేసింది. జన్‌కీబాత్ అంచనా ప్రకారం ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ 42 నుంచి 53 స్థానాలు గెలుస్తుంది. బీజేపీ 34 నుంచి 45 స్థానాలు గెలిచే అవకాశముంది. దీంతో ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీకి మళ్లీ నిరాశే ఎదురుకాబోతోంది.
ఛత్తీస్‌గఢ్ (90): ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
ఇండియా టుడే: బీజేపీ 36-46, కాంగ్రెస్ 40-50, ఇతరులు 1-5
జన్ కీ బాత్: బీజేపీ 34-45, కాంగ్రెస్ 42-53, ఇతరులు 3
న్యూస్ 18: బీజేపీ 41, కాంగ్రెస్ 46, ఇతరులు 3
పీపుల్స్ పల్స్: బీజేపీ 29-39, కాంగ్రెస్ 54-64, ఇతరులు 0-2
రిపబ్లిక్: బీజేపీ 34-42, కాంగ్రెస్ 44-52, ఇతరులు 0-2