Chhattisgarh: నారాయణపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్, ఆరుగురు మావోయిస్టులు హతం
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. అబుజ్మడ్ ప్రాంతంలో మావోయిస్టులు తలదాచుకున్నారని పక్కా సమాచారం అందడంతో భద్రతా బలగాలు శుక్రవారం ఆపరేషన్ ప్రారంభించాయి.

ఎన్‌కౌంటర్ అనంతరం అధికారులు ఆ ప్రాంతంలో విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలు, ఏకే-47, ఎస్ఎల్ఆర్ రైఫిల్స్, పేలుడు పదార్థాలు, నిత్యావసర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఛత్తీస్‌గఢ్‌లో లొంగుబాట్లు, ఎన్‌కౌంటర్‌లు కొనసాగుతున్న నేపథ్యంలో మావోయిస్టులు దశలవారీగా బలహీనమవుతున్నారు. ఆపరేషన్ కగార్ కింద భద్రతా బలగాలు నక్సలిజాన్ని నిర్మూలించేందుకు వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నాయి. మార్చి 31, 2026 నాటికి దేశాన్ని నక్సలిజం నుంచి పూర్తిగా విముక్తి చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు.
ఇటీవల సుకుమా జిల్లాలో రూ.1.18 కోట్ల బహుమతి ఉన్న 23 మంది నక్సలైట్లు లొంగిపోయారు. వీరిలో 11 మంది సీనియర్ కేడర్లు, 9 మంది మహిళలు ఉన్నారు.