చెన్నైలో నీటి సంక్షోభం... గుక్కెడు నీటి కోసం అల్లాడిపోతున్న ప్రజలు

Update: 2019-07-14 13:14 GMT

గుక్కెడు నీళ్ల కోసం చెన్నై విలపిస్తోంది.. నీటి సంక్షోభంతో మునుపెన్నడూ లేని దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటోంది. రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటిపోయాయి.. బోర్లు ఎండిపోయాయి.. వాటర్ ట్యాంకర్ బుక్ చేసినా.. వస్తుందో రాదో తెలియని పరిస్థితి. ఆఖరికి కాలకృత్యాలు తీర్చుకుందామన్నా ఎక్కడా నీళ్లు దొరకట్లేదు. ఫంక్షన్‌ హాళ్లు, రెస్టారెంట్ల, ఆఫీసులు. చివరకు ఇళ్లలో వంటలు చేసుకునేందుకు నీళ్లు లేక మూతపడుతున్నాయి. నీటి ఎద్దడి కారణంగా ప్రజలు రాత్రింబవళ్లు ప్రభుత్వం సరఫరా చేసే నీటి ట్యాంకర్ల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంటోంది. తాగునీటి కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిల్చోవాల్సిన పరిస్థితి నెలకొంది. నీటి సంక్షోభం తారా స్థాయికి చేరడంతో కనీస అవసరాల సరిపడా కూడా నీరు లేక అల్లాడిపోతున్నారు. అవసరాల కోసం నీటిని కొనుక్కోనే పరిస్థితి నెలకొంది.  

Full View

Tags:    

Similar News