Chardham Yatra: నేటి నుంచి చార్‌ధామ్ యాత్ర ప్రారంభం

Chardham Yatra: యాత్రను ప్రారంభించనున్న ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్

Update: 2021-09-18 04:17 GMT

ఉత్తరాఖండ్ లో నేటి నుంచి చార్ ధామ్ యాత్ర (ఫైల్ ఇమేజ్)

Chardham Yatra: ఛార్ ధామ్ యాత్ర మళ్లీ ప్రారంభం కాబోతోంది. గతంలో కరోనా కారణంగా ఈ యాత్రను ఉత్తరాఖండ్ ప్రభుత్వం రద్ద చేసింది. ప్రస్తుతం వైరస్ అదుపులో ఉండడం, జున్ 28న యాత్రను నిషేధించిన హైకోర్టు.. తాజాగా స్టే ఎత్తివేసేసింది. దీంతో యాత్రకు అనుమతివ్వాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇవాళ్టి నుంచి ఛార్ ధామ్ యాత్ర ప్రారంభమవుతుందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు.

చమోలి, రుద్రప్రయాగ్, ఉత్తరకాశి జిల్లాలలో జరగబోయే చార్‌ధామ్ యాత్రలో అవసరానికి తగినట్లుగా పోలీసు బలగాలను మోహరించాలని సూచించింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. ముఖ్యంగా భక్తులు ఏ కొలనులోనూ స్నానం చేయడానికి అనుమతించకూడదని హెచ్చరించింది. ఇక ఈ యాత్రకు ప్రపంచంలోని నలుమూలల నుంచి తరలివస్తుంటారు.

ఇక్కడకు వచ్చే వారు యమునోత్రి, గంగోత్రి, కేదరినాథ్, బ్రదీనాథ్ క్షేత్రాలను కూడా సందర్శిస్తుంటారు. అత్యంత పవిత్రమైన తీర్ధ యాత్రల్లో చార్ ధామ్ యాత్రను కూడా పిలుస్తుంటారు. ఈ యాత్ర దాదాపు 12 వేల అడుగుల ఎత్తులో ఇరుకైన దారుల వెంట కొనసాగుతోంది. 10 రోజుల పాటు ప్రయాణించాల్సి ఉంటుంది. ఆరు నెలలు మాత్రమే ఈ ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ యాత్రకు ముందుగా రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి ఉంటుంది. 

Full View


Tags:    

Similar News