Char Dham Yatra: చార్‌ధమ్ యాత్రకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం అనుమతి

Char Dham Yatra: చార్‌ధమ్ యాత్రకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Update: 2021-10-06 16:00 GMT

Char Dham Yatra: చార్‌ధమ్ యాత్రకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం అనుమతి

Char Dham Yatra: చార్‌ధమ్ యాత్రకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. కొవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ తో పాటు ఈ-పాస్ తప్పనిసరిగా ఉండాలని సూచించింది. దాంతో పాటు రెండు డోసులు కోవిడ్ టీకాలు తీసుకున్నట్టు ఉన్న సర్టిఫికేట్ తప్పనిసరి చేసింది. దీంతో పాటు కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ ఉన్న సరిపోతుందని స్పష్టం చేసింది. కోవిడ్ నెగెటివ్ రిపోర్ట్ ప్రయాణానికి 72 గంటల ముందు కంటే ఎక్కువ సమయం మించకూడదని పేర్కొంది.

ఇంతకుముందు కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రికి వెళ్లే సంఖ్యపై హైకోర్టు పరిమితి విధించింది. బద్రీనాథ్‌కు రోజుకు వెయ్యి మంది, కేదార్‌నాథ్‌కు 800, గంగోత్రికి 600, యమునోత్రికి 400 మంది వెళ్లేందుకు అవకాశం ఇచ్చింది. అలాగే చార్‌ధామ్ పరిధిలో ఉన్న నదుల్లో స్నానాలు చేయడంపై సైతం నిషేధం విధించింది. దీనిపై ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. 

Tags:    

Similar News