చంద్రయాన్‌-2 జాబిల్లి చిత్రాలు విడుదల

Update: 2019-10-06 07:25 GMT

చంద్రుడి ఉపరితల ఫొటోలను ఇస్రో విడుదల చేసింది. చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌లో అమర్చిన ఆర్బిటర్‌ హై రెసొల్యూషన్‌ కెమెరా (ఓహెచ్‌ఆర్‌సీ).. చంద్రుడి ఉపరితలానికి 100 కిలోమీటర్ల దూరం నుంచి ఈ ఫొటోలు తీసింది. సుమారు 14 కిలోమీటర్ల వ్యాసం, మూడు కిలోమీటర్ల లోతు ఉన్న ఈ లోయను ఆర్బిటర్‌ తన చిత్రాల్లో బంధించింది. దక్షిణ ధ్రువానికి సమీపంలో ఉన్న ఈ లోయ చిత్రాల్లో పెద్ద పెద్ద రాళ్ల వంటి నిర్మాణాలతో పాటు చిన్న గుంతల్లాంటివి ఉన్నాయని ఇస్రో తెలిపింది.




 

Tags:    

Similar News