Chandrababu: ఇవాళ ఢిల్లీకి చంద్రబాబు.. పొత్తులపై బీజేపీ నేతలతో చర్చ

Chandrababu: మ.4గంటలకు హస్తినకు వెళ్లనున్న టీడీపీ అధినేత

Update: 2024-03-07 03:32 GMT

Chandrababu: ఇవాళ ఢిల్లీకి చంద్రబాబు.. పొత్తులపై బీజేపీ నేతలతో చర్చ

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు బాబు హైదరాబాద్‌ నుండి ఢిల్లీకి బయలుదేరనున్నారు. పొత్తులపై చర్చించడానికి ఢిల్లీకి రమ్మని చంద్రబాబుకు అమిత్‌ షా ఆహ్వానం పలికారు. నేటి రాత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటీ కానున్నారు.

చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉంది. చంద్రబాబు అమిత్ షా భేటీ తర్వాత పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని హైకమాండ్‌కు ఇప్పటికే మెజారిటీ ఏపీ బీజేపీ నేతలు సూచించారు. ఏపీలో బీజేపీ, టీడీపీతో పొత్తు పెట్టుకుని రెండు, మూడు ఎంపీ సీట్లు గెలువాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తుందని తెలుస్తోంది.

Tags:    

Similar News