Ambulance for Plants Treatment: వృక్షాల చికిత్సకు అంబులెన్స్.. చండీఘడ్ ప్రభుత్వం నిర్ణయం

Ambulance for Plants Treatment: ఇప్పటివరకు మనం మనుషులకు అనారోగ్యం ఉంటే వారికి అవసరమైన చికిత్స అందించే విధంగా తరలించేందుకు ప్రత్యేక అంబులెన్స్ సర్వీసులు ప్రవేశపెట్టారు.

Update: 2020-07-24 02:53 GMT
Ambulance for Plants Treatment

Ambulance for Plants Treatment: ఇప్పటివరకు మనం మనుషులకు అనారోగ్యం ఉంటే వారికి అవసరమైన చికిత్స అందించే విధంగా తరలించేందుకు ప్రత్యేక అంబులెన్స్ సర్వీసులు ప్రవేశపెట్టారు. తాజాగా ఏపీ ప్రభుత్వం సుమరుగా 1,100ల సర్వీసులను కొత్తగా ప్రారంభించింది. తెలంగాణా ప్రభుత్వం సైతం ఇప్పటివరకు ఉన్నవాటితో పాటు అదనంగా మరో వంద సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇవన్నీ కేవలం ఆపద సమయంలో మనుష్యులకు చికిత్స అందించే విధంగా తరలించేందుకు మాత్రమే. దీనికి భిన్నంగా చండీఘడ్ ప్రభుత్వం జబ్బుపట్టిన, చీడ పట్టిన మొక్కలు, వృక్షాలకు చికిత్స అందించేందుకు నూతన వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. అయితే మనుష్యులకు సంబంధించి రోగులకు తరలిస్తే, ఇక్కడ వృక్షాలకు సంబంధించి చికిత్స బృందం వెళుతుంది. అయితే ఇక్కడ స్థానిక ప్రజలు చేయాల్సిన పనేమిటంటే చీడపట్టిన వృక్షాలను గుర్తించి, ఈ అంబులెన్స్ సర్వీసులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేయడమే. ఇది తెలిసిన వెంటనే సంబంధిత చికిత్స బృందం వచ్చి, చెట్లను బతికించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తారు.

మనుషులకు అంబులెన్స్ దొరకడమే కష్టమై ఈ రోజుల్లో పాడై, జబ్బుపడ్డ వృక్షాలకు అంబులెన్స్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు చండీగఢ్ పర్యావణ శాఖ. మనుషులు, జంతువులకే కాదు మొక్కల్లో ఉన్న ప్రాణాలను రక్షించేందుకు వారి ఈ అంబులెన్స్ లు పనిచేస్తున్నాయి. జబ్బుపడ్డ వృక్షాలకు సరైన చికిత్స అందించడానికి చండీగఢ్ పర్యావణ శాఖ అధికారులు అంబులెన్స్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు.

క్రిమి కీటకాలతో, చీడ పురుగులతో జబ్బుపడ్డ వృక్షాల కోసం ఈ ఎమర్జెన్సీ సర్వీసు (అంబులెన్స్) వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాంటి చెట్లను ప్రజలు గమనించినట్లయితే వాటి చికిత్స కోసం ఓ ప్రత్యేకమైన టోల్ ఫ్రీ నెంబరును కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. వాటి చికిత్స నిమిత్తం ఓ బృందాన్ని కూడా వెంటనే పంపుతామని దేవేంద్ర దలై అనే పర్యావరణ శాఖ అధికారి ఒకరు ప్రకటించారు.

Tags:    

Similar News