Third Wave: ఈ నెలలోనే థర్డ్‌వేవ్‌ వచ్చే ఛాన్స్ ఉంటుందన్న పరిశోధనలు

Third Wave: అక్టోబర్‌లో గరిష్ఠస్థాయికి కేసుల సంఖ్య..? * వ్యాక్సినేషన్‌ స్పీడప్‌ చేయాలంటున్న నిపుణులు

Update: 2021-08-03 03:11 GMT

Representational Image

Third Wave: భారత్‌కు మూడో వేవ్‌ ముప్పు పొంచి ఉందా అంటే.. అవుననే సంకేతాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ నెలలోనే థర్డ్‌వేవ్‌ సంభవిస్తుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. క్రమంగా పెరుగుతూ అక్టోబరులో గరిష్ఠ స్థాయికి కేసులు చేరుకోవచ్చని తెలిపాయి. అయితే.. సెకండ్‌ వేవ్‌తో పోలిస్తే.. థర్డ్‌వేవ్‌ తీవ్రత తక్కువగా ఉంటుందని అధ్యయనాల్లో తెలుస్తోంది. మూడో వేవ్‌ తారాస్థాయిలో ఉన్నప్పుడు.. రోజువారీ కేసుల సంఖ్య లక్ష లోపు ఉంటుందని పేర్కొంది.

థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచిఉండటంతో.. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని నిపుణులు చెబుతున్నారు. వైరస్‌కు హాట్‌స్పాట్‌లుగా మారుతున్న ప్రాంతాలను సత్వరం గుర్తించడానికి నిరంతర పరిశీలన అవసరమన్నారు. కొత్త వేరియంట్లను పట్టుకోవడానికి వైరస్‌ జన్యుక్రమాలను మరింత ఎక్కువగా ఆవిష్కరించాలని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ తాజా విజృంభణకు కారణమైన డెల్టా రకం కరోనా వైరస్‌.. భారత్‌లోనే తొలుత వెలుగు చూసిందని నిపుణులు గుర్తుచేశారు.

రెండో ఉధృతి మొదలై ఇప్పటికి 5 నెలలు గడిచాయి. ఇప్పుడు దేశంలో రోజువారీ కేసుల సంఖ్య దాదాపు 40వేల వద్ద ఉంటోంది. గత కొద్దిరోజులుగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు సగం కేరళలోనే వెలుగు చూస్తున్నాయి. ఆ రాష్ట్రం తదుపరి హాట్‌స్పాట్‌గా మారొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరికొన్ని పెద్ద రాష్ట్రాల్లో ఇన్‌ఫెక్షన్లు పెరిగితే.. దేశవ్యాప్త కేసుల సంఖ్య మరోసారి పెరుగుతుందని హెచ్చరించారు. ప్రజల్లో అలసత్వం అసలకే మంచిది కాదని వారించారు.

Tags:    

Similar News