సెలబ్రిటీలకు కేంద్రం షాక్.. సరోగెట్ యాడ్స్ పై ఉక్కుపాదం

Surrogate Ads: ప్రజలను ఆకర్షించేందుకు సెలబ్రిటీలతో ప్రచారం

Update: 2022-06-14 08:37 GMT

సెలబ్రిటీలకు కేంద్రం షాక్.. సరోగెట్ యాడ్స్ పై ఉక్కుపాదం

Surrogate Ads: కేంద్రం సెలబ్రిటీలకు షాక్ ఇచ్చింది. ప్రజలను మభ్యపెట్టి సెలబ్రిటీలు ఇచ్చే తప్పుడు ప్రకటనలకు ఇక మీదట చెక్ పెట్టబోతోంది. దీని కోసం కొత్తగా ఒక చట్టాన్ని తీసుకురాబోతోంది. తప్పుదోవ పట్టించే ప్రకటనల నిరోధించడానికి కొన్ని కీలక గైడ్ లైన్స్ ని అమలులోకి తీసుకురాబోతోంది.

వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనల నియంత్రణకు.. కేంద్రం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం సరోగేట్ యాడ్స్ ని నిషేధించింది. ప్రచారం చేయటానికి వీల్లేని ఉత్పత్తులకు సంబంధించి, వాటి పేరుతోనే అదేరీతిలో ఉండేట్లుగా కనిపించే అడ్వర్టైజ్మెంట్లను చూపించటానికి ఇక తెరపడనుంది. కేంద్రం జారీ చేసిన తాజా మార్గదర్శకాలు.. ఇపుడు కనబడుతున్న ప్రకటనలకు కూడా వర్తిస్తుందని కేంద్రం చెప్పింది. ఈ ప్రకటనల్లో కనబడుతున్న ప్రముఖులు, సెలబ్రిటీలపైన కూడా చర్యలు తీసుకోబోతున్నట్లు మార్గదర్శకాల్లో కేంద్రం స్పష్టంగా చెప్పింది.

వినియోగదారులను ఆకర్షించేలా రాయితీలు, ఉచితాల వంటి ప్రకటనలకు కూడా నిబంధనలు వర్తిస్తాయని కేంద్రం స్పష్టంగా ప్రకటించింది. అలాగే పిల్లలను టార్గెట్ గా చేసుకుని కనిపించే యాడ్స్ కు కూడా ఇవే వర్తిస్తాయి. తప్పుదోవ పట్టించే ప్రకటనలు వినియోగదారుల రక్షణ చట్టం పేరుతో.. కేంద్రం మార్గదర్శకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని చెప్పింది.

తాజా మార్గదర్శకాల ప్రకారం మొదటిసారి చట్టాన్ని ఉల్లంఘించే అడ్వర్టైజ్మెంట్లకు 10 లక్షల ఫైన్ వేయనున్నారు. తర్వాత ప్రతిసారి 50 లక్షల చొప్పున జరిమానా విధిస్తారని సమాచారం. తయారీదారులు, ప్రచారకర్తలు, ప్రకటనకర్తలు అందరికీ మార్గదర్శకాలు కచ్చితంగా వర్తించనున్నాయి

కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రకటనల్లో నటించే సెలబ్రిటీలకు, ప్రకటనలను తయారు చేసె అడ్వర్టైజ్మెంట్ సంస్ధలకు, ఉత్పత్తుల యాజమాన్యాలకు భారీ స్థాయిలో ఈ ఫైన్లు వర్తించనున్నాయి. ప్రకటనలు ప్రజలను విసృతంగా ఆకర్షిస్తాయి. లిక్కర్ సంస్థల పేరుతో ఉంటే అడ్వర్టైజ్మెంట్లు ఈమధ్య కాలంలో టీవీల్లో ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రకటనల్లో మినరల్ వాటర్, షోడాల పేరుతో ప్రమోట్ చేసినా.. సదరు ప్రకటనను చూస్తున్నపుడు అందరికీ గుర్తుకొచ్చేది లిక్కర్ బ్రాండ్ మాత్రమే. ఇప్పుడు వాటిల్లో కనిపించే సెలబ్రిటీలకూ ఇకనుండి ఫైన్ పడుతుందని కేంద్రం చెబుతోంది.

కమర్షియల్ యాడ్ ద్వారా భారీగా డబ్బు సంపాదిస్తున్న సెలబ్రిటీలు ఇక నుండి జాగ్రత్తగా ఉండకపోతే పైన్ ల రూపంలో సెలబ్రిటీలు డబ్బు పొగొట్టుకొవాల్సి వస్తుందని, జాగ్రత్త పడాల్సి ఉందని తాజా రూల్స్ చెబుతున్నాయి.

Tags:    

Similar News