Income Tax Returns: ఐటీ రిటర్న్స్ దాఖలు గడువు పెంపు

Income Tax Returns: 2020-2021 ఫైనాన్షియల్ ఇయర్ రిటర్న్ దాఖలు చేయడానికి గడువును పొడిగించింది.

Update: 2021-05-21 02:47 GMT

Income Tax Returns 

Income Tax Returns: గత ఏడాది ఐటీ రిటర్నుల దాఖలుకు గడువును మార్చి 31, 2021 వరకు పొడిగించి అవకాశం ఇచ్చిన కేంద్రం, ఈసారి సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో.. 2020-2021 ఫైనాన్షియల్ ఇయర్ రిటర్స్న్ దాఖలు చేయడానికి గడువును పొడిగించింది. వ్యక్తిగతంగా వేసే వాటికి సెప్టెంబర్ 30 వరకు.. సంస్థలకు అక్టోబర్ 31 వరకు.. ట్యాక్స్ ఆడిట్ చేయించేవారికి నవంబర్ 30 వరకు పొడిగించింది.

కరోనా వ్యాప్తి, తదితర పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఐటీ రిటర్నుల దాఖలు గడువును మరింత పొడిగించింది. వ్యక్తులు ఐటీ రిటర్నులు దాఖలు చేసేందుకు సెప్టెంబరు 30 వరకు, కంపెనీలు ఐటీ రిటర్నులు దాఖలు చేసేందుకు నవంబరు 30 వరకు అవకాశం కల్పించింది.

అంతేకాదు, కంపెనీలు తమ ఉద్యోగులకు జారీ చేసే ఫారం-16 గడువును జూలై 15 వరకు పొడిగించింది. ట్యాక్స్ ఆడిట్ రిపోర్టుల దాఖలుకు అక్టోబరు 31, ట్రాన్స్ ఫర్ ప్రైసింగ్ సర్టిఫికెట్ల దాఖలుకు నవంబరు 30 వరకు గడువు పెంచింది.ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఓ ప్రకటనలో తెలిపింది. ఇక, ఐటీ రిటర్నుల దాఖలు మరింత సులువుగా జరిగేలా సరికొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ కు కేంద్రం రూపకల్పన చేసింది. పాత పోర్టల్ (www.incometaxindiaefiling.gov.in)కు బదులుగా ఈ కొత్త పోర్టల్ (www.incometaxgov.in) జూన్ 7 నుంచి అందుబాటులోకి రానుంది. పాత పోర్టల్ జూన్ 1 నుంచి 6వ తేదీ వరకు అందుబాటులో ఉండదని కేంద్రం స్పష్టం చేసింది.



Tags:    

Similar News