కొవిడ్ వ్యాక్సిన్ పై కేంద్ర ఆరోగ్య శాఖ కీలక సూచనలు

*కరోనా భారీన పడిన వారికి మూడు నెలల తర్వాతే వ్యాక్సిన్ వేయాలి *ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏళ్ల పైబడిన వారికి ప్రికాషన్ డోస్

Update: 2022-01-23 02:06 GMT

కొవిడ్ వ్యాక్సిన్ పై కేంద్ర ఆరోగ్య శాఖ కీలక సూచనలు

Central Health Department: కొవిడ్ వ్యాక్సిన్ కు సంబంధించి కేంద్రం కీలక సూచనలు చేసింది. కరోనా మహమ్మారి భారీన పడిన వారికి మూడు నెలల తర్వాతే వ్యాక్సిన్ వేయాలని తెలిపింది. కోవిడ్ భారీన పడిన వారికి సాధారణ డోసులు సహా ప్రికాషన్ డోసు వేసే విషయంలో మార్గదర్శకాలు జారీ చేయాలంటూ వట్టిన అభ్యర్ధన నేపధ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి వికాష్ షీల్ లేఖలు రాశారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సాధారణ వ్యాక్సినేషన్‌ ప్రక్రియతో పాటు 15-18 ఏళ్ల వయసు వారికీ వ్యాక్సిన్లు వేస్తున్నారు. మరోవైపు ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్‌ డోసు అందిస్తున్నారు. ఓ వైపు మూడో వేవ్‌ కారణంగా కరోనా కేసులు దేశంలో మళ్లీ పెరుగుతున్నాయి. వ్యాక్సిన్‌ వేసుకున్న వారు సైతం మళ్లీ కొవిడ్‌ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకునే విషయంలో కేంద్రం తాజా మార్గదర్శకాలు ఇచ్చింది.

Tags:    

Similar News