అగ్నిపథ్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. అగ్నివీరుల అర్హత వయస్సు ఐదేళ్లు పెంపు

*ట్విట్టర్‌లో కేంద్ర హోంశాఖ ప్రకటన

Update: 2022-06-18 05:00 GMT

అగ్నిపథ్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. అగ్నివీరుల అర్హత వయస్సు ఐదేళ్లు పెంపు

Agnipath Recruitment Scheme: దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌ స్కీమ్‌కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. కేంద్ర సైనిక బలగాల్లో 10శాతం అగ్నివీరులకు రిజర్వేషన్‌ కల్పిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. తొలి విడత అగ్నిపథ్‌ ఎంపికలకు 5 ఏళ్ల సడలింపును ఇచ్చింది. దీంతో గరిష్ఠ అర్హత వయస్సు 26 ఏళ్లుగా మారింది. కేంద్ర హోంశాఖ.. ఆమేరకు ట్విట్టర్‌లో వివరాలను వెల్లడించింది. కేంద్రం తాజా నిర్ణయంతో అగ్నిపథ్‌కు 17.5 ఏళ్ల నుంచి 26 ఏళ్లలోపు వారు అర్హులవుతారు. అగ్నిపథ్‌లో ఎంపికైనవారికి బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ వంటి సైనిక దళాల్లో 10 శాతం రిజర్వేషన్‌ ఇవ్వనున్నారు. సీఆర్‌పీఎఫ్‌, అస్సాం రైఫిల్స్‌లో 73వేల పోస్టులు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 18వేల పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఇక ఈనెల 24 నుంచి అగ్నిపథ్‌ నియమక ప్రక్రియ మొదలు కానున్నట్టు రక్షణశాఖ ఇప్పటికే ప్రకటించింది.

అగ్నిపథ్‌ స్కీమ్‌లో ప్రస్తుతం 45 వేలమందిని ఎంపిక చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. అర్హత వయస్సును తొలుత పదిహేడున్నర ఏళ్ల నుంచి 21 ఏళ్లు ప్రకటించింది. నాలుగేళ్ల స్వల్ప కాల సర్వీసును ప్రకటించింది. ఇందులో 6 నెలల పాటు శిక్షణ, మూడున్నరేళ్ల పాటు సర్వీసు ఉండనున్నది. పింఛను ఉండదని స్పష్టం చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. బీహార్‌, యూపీ, మధ్యప్రదేశ్‌, హర్యానా, తెలంగాణలో నిరసనలు హింసాత్మకంగా మారాయి. పలు స్టేషన్లలు రైల్‌ కోచ్‌లకు ఆందోళనకారులు నిప్పంటించారు. దీంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సికింద్రబాద్‌ రైల్వే స్టేషన్‌లో పోలీసుల కాల్పుల్లో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనలకు సంబంధించి యూపీలో 600 మందిని, బీహార్‌లో 260 మందిని పోలీసులు అరెస్టు చేశారు.





Tags:    

Similar News