Election Schedule: 12 గంటలకు తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌

Election Schedule: షెడ్యూల్ ప్రకటించిన వెంటనే అమల్లోకి ఎన్నికల కోడ్

Update: 2023-10-09 03:40 GMT

Election Schedule: 12 గంటలకు తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌

Election Schedule: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. ఇవాళ ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. ఈ మేరకు మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల సంఘం మీడియా సమావేశం కానుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం నేడు విడుదల చేయనుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌ఘడ్‌, మిజోరాంలో ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించనుంది. ఇక, డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలు, తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు, రాజస్థాన్‌లో 200 స్థానాలు, ఛత్తీస్‌గఢ్‌లో 90 స్థానాలు, మిజోరాం 40 స్థానాలకు ఎన్నికలు షెడ్యూల్‌ విడుదల కానుంది. కాగా, ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానుండటంతో నేటి నుంచి ఎన్నికల కోడ్‌ అమలులోకి రానుంది.

2018లో ఐదు రాష్ట్రాల్లోని నాలుగింటిలో ఎన్నికలు ఒకే దశలో జరిగాయి. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు దశల్లో జరిగాయి. షెడ్యూల్ ప్రకటన తర్వాత ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల వేడి రాజుకోనుంది. తెలంగాణలో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ జరగనుంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరగనున్న ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కన్నేసిన బీజేపీ అధికారంలోకి రావడమే పరమావధిగా పావులు కదుపుతోంది.

మరోవైపు, కేంద్రంలో తిరుగులేని శక్తిగా మారిన బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. మొత్తం 25 పార్టీలతో కలిసి ఏర్పడిన ఈ కూటమి బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. అయితే, ఇండియా కూటమి ఇప్పటి వరకు తమ ప్రధానమంత్రి అభ్యర్థిని ఇప్పటి వరకు ప్రకటించలేదు. అంతేకాదు, ఇందులోని పార్టీలు ఆయా రాష్ట్రాల్లోని శాసనసభ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగనున్నాయి.

తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. తెలంగాణ అసెంబ్లీ ప్రస్తుత పదవికాలం 2024 జనవరి16న ముగియనుంది. 2018లో డిసెంబర్ 7న తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఇక మధ్యప్రదేశ్ ‌లో‌ మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ప్రస్తుత పదవికాలం 2024 జనవరి6న ముగియనుంది. 2018 నవంబర్ 28న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. రాజస్థాన్‌లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 2024 జనవరి 14న అసెంబ్లీ పదవీకాలం ముగియనుంది. 2018లో తెలంగాణ అసెంబ్లీకి డిసెంబర్‌7న ఎన్నికలు జరిగాయి.

ఇక ఛత్తీస్‌గఢ్‌లో 2018 నవంబర్‌ 12 మరియు నవంబర్‌ 20న ఎన్నికలు జరిగాయి. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌ పదవీకాలం 2024 జనవరి3న ముగియనుంది. మిజోరాంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా... అసెంబ్లీ ప్రస్తుత పదవీకాలం 2023 డిసెంబర్ 17 న ముగియనుంది.

Tags:    

Similar News