CBSE 10th, 12th Result 2025: సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి ఫలితాలు ఎప్పుడంటే...
CBSE Board 10th, 12th Result 2025: సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలు రాసిన స్టూడెంట్స్ వాటి ఫలితాల కోసం వేచిచూస్తున్నారు. ఆ తరువాతి చదువులు, విద్యా సంస్థల్లో అడ్మిషన్స్ కోసం ఈ ఫలితాలు కీలకం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సీబీఎస్ఈ ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుండి ఏప్రిల్ 4 మధ్య సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. మొత్తం 42 లక్షలకు పైగా స్టూడెంట్స్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు పరీక్షలకు హాజరయ్యారు. గతంలో పద్ధతి ప్రకారమే 10వ తరగతి, 12వ తరగతి పరీక్షల ఫలితాలు ఒకే రోజు విడుదల చేసే అవకాశాలున్నాయి.
ప్రస్తుతానికి సీబీఎస్ఈ బోర్డ్ ఫలితాల విడుదల డేట్, టైమ్ విషయంలో ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాకపోతే గతంలో సీబీఎస్ఈ ఫలితాలు వెల్లడించిన సరళిని పరిశీలిస్తే, ప్రతీ ఏడాది మే నెల రెండో వారంలో ఈ ఫలితాలు రిలీజ్ చేయడం జరుగుతోంది.
2024 సీబీఎస్ఈ ఫలితాలు ఆ ఏడాది మే 13వ తేదీన రిలీజ్ అయ్యాయి. అలాగే 2023 లో సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలు ఆ ఏడాది మే 12వ తేదీన రిలీజ్ అయ్యాయి. అంతకు ముందు వరుసగా రెండేళ్లు ఫలితాలు ఆలస్యంగా విడుదలయ్యాయి. కొవిడ్-19 కారణంగా సీబీఎస్ఈ పరీక్షల మార్క్స్ ఎవాల్యుయేషన్ ఆలస్యమవడంతో 2022 లో జులై 22న సీబీఎస్ఇ ఫలితాలు ఎనౌన్స్ చేసింది.
సీబీఎస్ఈ ఫలితాల లింక్స్
సీబీఎస్ఈ టెన్త్ క్లాస్, ట్వెల్త్ క్లాస్ ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in లోకి లాగాన్ అవడం ద్వారా చెక్ చేసుకోవచ్చు. లేదంటే కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిజిలాకర్, ఉమంగ్ యాప్ (DigiLocker, UMANG app) ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. సీబీఎస్ఈ బోర్డ్ 10వ తరగతి, 12వ తరగతి ఫలితాలు రిలీజ్ అయిన వెంటనే ఆ వివరాలు ఇక్కడ అప్‌డేట్ చేయడం జరుగుతుంది.