కెనరా బ్యాంక్ మహిళల కోసం క్యాన్సర్ బీమా పథకం: సేవింగ్స్ ఖాతాతో లక్షల విలువైన ఆరోగ్య రక్షణ

కెనరా బ్యాంక్ సేవింగ్స్ ఖాతాతో మహిళలకు క్యాన్సర్ చికిత్సలకు ఉచిత బీమా. రూ.3లక్షల నుంచి రూ.10లక్షల వరకు బీమా రక్షణ. ఆరోగ్య బీమా, మహిళల కోసం ప్రత్యేక బ్యాంకింగ్ సేవలు.

Update: 2025-07-17 10:09 GMT

Canara Bank Launches Cancer Insurance Scheme for Women: Valuable Health Coverage with Savings Account

కెనరా బ్యాంక్ మహిళల కోసం వినూత్నంగా అందిస్తున్న ఆరోగ్య బీమా పథకం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. 'కెనరా ఏంజెల్' పేరుతో ప్రవేశపెట్టిన ఈ సేవింగ్స్ ఖాతా ఆధారిత స్కీమ్‌ ద్వారా 18 నుంచి 70 ఏళ్ల వయస్సు గల మహిళలకు రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు క్యాన్సర్ చికిత్సలకు ఉచిత బీమా రక్షణ లభిస్తుంది.

క్యాన్సర్ చికిత్సకు ఉచిత బీమా:

ఈ సేవింగ్స్ అకౌంట్ ప్రత్యేకత ఏమిటంటే... మినిమం క్వార్టర్లీ బ్యాలెన్స్‌ మెయింటైన్ చేస్తే క్యాన్సర్‌ చికిత్సకు అదనపు ప్రీమియం లేకుండా ఆరోగ్య బీమా లభిస్తుంది. రూ.5,000 నుంచి రూ.1లక్ష వరకు బ్యాలెన్స్‌ ఆధారంగా మూడు రకాల అకౌంట్లు – లావెండర్, రోజ్, ఆర్చిడ్ విభాగాల్లో ఈ స్కీమ్ అందుబాటులో ఉంది.

లావెండర్ అకౌంట్:

  1. కనీస బ్యాలెన్స్: రూ.5,000
  2. క్యాన్సర్ బీమా: రూ.3 లక్షలు
  3. ప్రమాద బీమా: రూ.2 లక్షలు
  4. మొత్తంగా రూ.8 లక్షల ఇన్సూరెన్స్ కవర్
  5. అదనంగా: బ్యాగేజీ బీమా, పర్చేజ్ ప్రొటెక్షన్, ఎయిర్ యాక్సిడెంట్ కవరేజీ

రోజ్ అకౌంట్:

  1. కనీస బ్యాలెన్స్: రూ.30,000
  2. క్యాన్సర్ బీమా: రూ.5 లక్షలు
  3. కుటుంబ సభ్యులకు జీరో బ్యాలెన్స్ అకౌంట్లు
  4. మొత్తం ఇన్సూరెన్స్ ప్రయోజనాలు: రూ.16 లక్షలు

ఆర్చిడ్ అకౌంట్:

  1. కనీస బ్యాలెన్స్: రూ.1లక్ష
  2. క్యాన్సర్ బీమా: రూ.10 లక్షలు
  3. కుటుంబంలో ముగ్గురికి జీరో బ్యాలెన్స్ అకౌంట్లు
  4. మొత్తం ఇన్సూరెన్స్ కవర్: రూ.26 లక్షలు

అదనపు లాభాలు:

  1. ఎటిఎం డెబిట్ కార్డుతో రూ.2 లక్షల కవరేజీ
  2. ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ – దేశీయంగా ప్రతి క్వార్టర్‌కు 2 సార్లు, అంతర్జాతీయంగా సంవత్సరానికి 2 సార్లు
  3. ఉచిత హెల్త్ చెకప్, వైద్య పరీక్షలు
  4. ఎన్‌ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్, ఐఎంపిఎస్, ఎస్‌ఎంఎస్, చెక్‌బుక్ సదుపాయాలు ఉచితం

ముఖ్య సమాచారం:

  • ఖాతా ఓపెన్ చేసిన 3 రోజుల్లోగా మినిమం బ్యాలెన్స్ జమ చేస్తేనే బీమా యాక్టివేట్ అవుతుంది
  • బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోతే సాధారణ ఖాతాగా మారుతుంది
  • ఖాతాదారు 70 ఏళ్ల వయసు నిండిన వెంటనే బీమా చెల్లదు
Tags:    

Similar News