గుండెపోటుతో బురుండీ అధ్యక్షుడు కన్నుమూత

బురుండీ అధ్యక్షుడు ఎన్‌కురుంజిజా హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 55 సంవత్సరాలు.

Update: 2020-06-10 07:18 GMT
Kurunziza (file photo)

బురుండీ అధ్యక్షుడు ఎన్‌కురుంజిజా హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 55 సంవత్సరాలు. ఆయనకు గుండెపోటు రావడంతో మరణించినట్లు బురుండి ప్రభుత్వం తెలిపింది. దేశ ప్రజలకు ఇది దుర్వార్త అని అధ్యక్షుడు ఎన్‌కురుంజిజా ఇక లేరని ప్రభుత్వం ట్వీట్ లో పేర్కొంది. కాగా ఎన్‌కురుంజిజా శనివారం మధ్యాహ్నం వరకూ వాలీబాల్ కోర్టులో గడిపారు. ఒక మ్యాచ్‌ ను సైతం ఎన్‌కురుంజిజా తిలకించారు.. అయితే ఆ సమయంలో ఆయన అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యారు దాంతో ఆయనను తూర్పు బురుండిలోని కరుజీలోని ఆసుపత్రికి తరలించారు.

అయితే ఆదివారం కోలుకున్నట్లు కనిపించారు. మనుషులతో మాట్లాడటం అలాగే కెన్యాలో చికిత్స పొందుతున్న తన భార్యతో కూడా మాట్లాడారు.. అయితే సోమవారం ఉదయం నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించింది. ఆ తరువాత అతను గుండెపోటుకు గురయ్యారు. వైద్యులు ఆయనను బ్రతికించేందుకు విశ్వప్రయత్నాలు చికిత్స పొందుతూ ఎన్‌కురుంజిజా మంగళవారం తుదిశ్వాస విడిచారు. కాగా ఇటీవలే ఎన్‌కురుంజిజా సతీమణి డెనిస్‌ ఎన్‌కురుంజిజాకు కరోనా సోకడంతో ఆమెను కెన్యాలో అగాఖాన్‌ యూనివర్సిటీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలో భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగానే ఎన్‌కురుంజిజా మరణించడంతో బురుండీ ప్రజలు పెనువిషాదంలో మునిగిపోయారు. అధ్యషుడి మృతిపట్ల మంగళవారం నుండి ఏడు రోజులు జాతీయ సంతాపం దినాలుగా బురుండీ ప్రభుత్వం ప్రకటించింది. 

Tags:    

Similar News