Chhattisgarh: కుప్పకూలిన భవనం.. బిలాస్‌పూర్ మంగళచౌక్ ప్రాంతంలో ఘటన
Chhattisgarh: డ్రెయిన్ కోసం తవ్విన గొయ్యి కారణంగా కూలిన భవనం
Chhattisgarh: కుప్పకూలిన భవనం.. బిలాస్‌పూర్ మంగళచౌక్ ప్రాంతంలో ఘటన
Chhattisgarh: చత్తీస్ గఢ్‌లో భవనం కుప్పకూలింది. బిలాస్‌పూర్‌లోని మంగళచౌక్‌లో ఉన్న శ్రీరామ్ మెడికల్ షాపు మూడు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. మున్సిపల్ కార్పొరేషన్ భవనం పక్కనే డ్రెయిన్ నిర్మిస్తోంది. అయితే డ్రెయిన్ నిర్మించడానికి భవనం ప్రక్కన గొయ్యి తవ్వడంతో ప్రమాదం జరిగినట్లు తెలిస్తోంది. సంఘటన జరిగిన ప్రాంతం ప్రధాన రహదారికి దగ్గరగా ఉండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. మున్సిఫల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.