సాజిద్ అక్రమ్ అంతిమ సంస్కారాలు చేసేందుకు భార్య నిరాకరణ

సాజిద్ అక్రమ్ అంతిమ సంస్కారాలు చేసేందుకు భార్య నిరాకరణ అతడితో తనకు ఎలాంటి సంబంధం లేదని.. మృతదేహాన్ని కూడా తాకబోనని తెగేసి చెప్పిన భార్య

Update: 2025-12-22 12:54 GMT

సాజిద్ అక్రమ్ అంతిమ సంస్కారాలు చేసేందుకు భార్య నిరాకరణ

అస్ట్రేలియాలో బొండి బీచ్‌లో కాల్పులు జరిపిన సాజిద్ అక్రమ్ మృతదేహాన్ని తీసుకునేందుకు అతని భార్య నిరాకరించారు. అతడితో తనకు ఎలాంటి సంబంధం లేదని, మృతదేహాన్ని కూడా తాకబోనని తెగేసి చెప్పింది. సాజిద్ అక్రమ్ చేసిన దారుణం వల్ల తన కుటుంబం పరువు పోయిందని, సమాజంలో తల ఎత్తుకోలేకపోతున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అతని భార్య తీసుకున్న నిర్ణయం పట్ల ఆమె చూపిన కఠిన వైఖరిని కొందరు ప్రశంసిస్తున్నారు. బొండి బీచ్‌‌లో ‎సాజిద్, అతని కొడుకు తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపి.. 16 మంది ప్రాణాలను తీశాడు. పోలీసులు నిందితులని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేయగా, ఎదురుకాల్పుల్లో సాజిద్ అక్కడికక్కడే మృతి చెందాడు.

Tags:    

Similar News