Delhi Public School: ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు
Delhi Public School: మథుర రోడ్‌లోని స్కూల్‌కు మెయిల్ ద్వారా బెదిరింపు
Delhi Public School: ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు
Delhi Public School: దేశ రాజధానిలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. పాఠశాల ఆవరణలో బాంబులున్నాయంటూ మథురా రోడ్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు ఈ- మెయిల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం.. విద్యార్థులను, సిబ్బందిని అక్కడి నుంచి బయటకు పంపించింది. సమాచారం అందుకున్న పోలీసులు, బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టగా.. ఎలాంటి పేలుడు పదార్థాలు గానీ..అనుమానాస్పద వస్తువులు గానీ లభ్యంకాలేదు. ప్రస్తుతం ఈ-మెయిల్‌పై పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
సరిగ్గా రెండు వారాల క్రితం కూడా ఇదే తరహాలో ఢిల్లీ స్కూల్‌కు ఈ-మెయిల్ వచ్చింది. సాదిఖ్ నగర్‌లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో బాంబులు ఉన్నాయని అందులో పేర్కొనడంతో ఆందోళనకు గురైన యాజమాన్యం.. విద్యార్థులు, టీచర్లను బయటకు పంపించింది. అప్పుడు కూడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు.