Bihar: బీహార్‌లోని ససారంలో బాంబు పేలుడు

Bihar: ఇల్లు పేలిన ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలు

Update: 2023-04-02 12:15 GMT

Bihar: బీహార్‌లోని ససారంలో బాంబు పేలుడు

Bihar: బీహార్‌లో బాంబు పేలుడు ఘటన కలకలం సృష్టిస్తోంది. రొహతాస్ జిల్లా ససారంలో ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ససారంలోని బీహెచ్‌యూ ఆసుపత్రికి తరలించారు. అయితే సమాచారాన్ని అందుకున్న ఫోరెన్సిక్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు. ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఓ స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. అయితే మొదట్లో దీన్ని మతపరమైన దాడిగా భావించినా.. ససారం డీఎం ధర్మేంద్ర కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి అక్రమ పేలుడు పదార్థాల నిర్వహణే దీనికి కారణమని ప్రాథమికంగా నిర్థారించారు.

Tags:    

Similar News