JP Nadda: జేపీ నడ్డా పదవీకాలం పొడిగింపు

JP Nadda: ఆమోదం తెలిపిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు

Update: 2024-02-18 12:49 GMT

JP Nadda: జేపీ నడ్డా పదవీకాలం పొడిగింపు

JP Nadda: బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీ కాలాన్ని ఈ ఏడాది జూన్ వరకు పొడిగిస్తూ పార్లమెంటరీ బోర్డు ఆమోదం తెలిపింది. మరికొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో ఈ సమయంలో అధ్యక్షుడి మార్పు సరికాదని అధిష్టానం అభిప్రాయపడినట్లు తెలిసింది. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌గా తాజాగా పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశం ఆమోదించింది. జేపీ న‌డ్డా స్వ‌యంగా ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అధికారాన్ని పార్టీ ఆయ‌న‌కు క‌ట్ట‌బెట్టింది. ఈ నిర్ణ‌యాల‌కు ఆ త‌ర్వాత పార్టీ పార్ల‌మెంటరీ బోర్డు ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది.

Tags:    

Similar News