BJP: నేడు ఢిల్లీలో బీజేపీ కీలక సమావేశం.. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలపై చర్చ
BJP: సాయంత్రం వరకు రెండు దఫాలుగా జరగనున్న సమావేశం
BJP: నేడు ఢిల్లీలో బీజేపీ కీలక సమావేశం.. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలపై చర్చ
BJP: నేడు ఢిల్లీలో బీజేపీ కీలక సమావేశం జరగనుంది. ముఖ్యనేతలతో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్‌షా, బీఎల్ సంతోష్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో.. అన్ని రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌లు, మోర్చా అధ్యక్షులు పాల్గొననున్నారు. సాయంత్రం వరకు రెండు దఫాలుగా జరగనున్న ఈ మీటింగ్‌లో పార్టీ బలోపేతం, సంస్థాగత అంశాలు, సార్వత్రిక ఎన్నికలు, ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలపై చర్చించనున్నారు.