రాజ్యసభలో బీజేపీకి ఎదురుదెబ్బ తగులుతుందా?

నేడు ఏడోరోజు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కోనసాగుతున్నాయి. ఈ సందర్బంగా వివాదాస్పదమైన వ్యవసాయ సంస్కరణ బిల్లులు - రైతు ఉత్పత్తి వాణిజ్యం..

Update: 2020-09-20 05:19 GMT

నేడు ఏడోరోజు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కోనసాగుతున్నాయి. ఈ సందర్బంగా వివాదాస్పదమైన వ్యవసాయ సంస్కరణ బిల్లులు - రైతు ఉత్పత్తి వాణిజ్యం మరియు వాణిజ్యం (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు, 2020, ధరల భరోసా మరియు వ్యవసాయ సేవల బిల్లు 2020 , రైతు (సాధికారత మరియు రక్షణ) ఒప్పందం, మరియు ముఖ్యమైన వస్తువులు (సవరణ) బిల్లు, 2020 బిల్లులు ఆమోదం కోసం కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం ఉద్దేశించిన ఆ మూడు బిల్లులు ఎలాంటి అవాంతరాలు లేకుండా లోక్‌సభలో ఆమోదం పొందగా మూడు బిల్లులపై నేడు రాజ్యసభలో ఓటింగ్‌ జరుగనుంది. రాజ్యసభలో బిల్లులపై గట్టెక్కడం అధికార పార్టీకి పరీక్షగా మారింది. గత మిత్రపక్షం శివసేనా తోపాటు తాజాగా శిరోమణీ అకాలీదళ్‌ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కీలకమైన బిల్లులను రాజ్యసభలో గట్టేక్కిచ్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మొత్తం 245 సభ్యుల గల పెద్దల సభలో ప్రస్తుతం బీజేపీకి సొంతంగా 86 సభ్యుల మద్దతు ఉంది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్‌కు 40 మంది సభ్యులు ఉండగా.. మిగతా స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. మిత్రపక్షాలతో కలుపుకుని తమకు 130 మంది సభ్యులు మద్దతు ఉందని బీజేపీ అంటోంది. అన్నాడీఎంకే, బీజూ జనతాదళ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుకు ‌ మద్దతు ఇచ్చే అవకాశం ఉండగా. ఆమ్‌ ఆద్మీ పార్టీ, బీఎస్పీ , టీడీపి పార్టీల ఓటింగ్‌పై ఇంకా స్పష్టత రాలేదు. టీఆర్ఎస్, బీఎస్పీ, ఎస్పీ వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉంది.

Tags:    

Similar News