JP Nadda: రాజ్యసభ సభ్యత్వానికి జేపీ నడ్డా రాజీనామా

JP Nadda: హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం

Update: 2024-03-05 01:48 GMT

JP Nadda: రాజ్యసభ సభ్యత్వానికి జేపీ నడ్డా రాజీనామా

JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. నడ్డా రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. జేపీ నడ్డా హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నడ్డా 2014 నుంచి 2019 వరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. 2020 జనవరి 20న బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. ఈ ఏడాది ఏప్రిల్ తో 57 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియనుంది. వీరిలో జేపీ నడ్డా ఉన్నారు. మరోసారి రాజ్యసభకు నడ్డా ప్రాతి నిధ్యం వహించనున్నారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో గుజరాత్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Tags:    

Similar News