Maharashtra: మహారాష్ట్రలో బైక్‌ అంబులెన్స్‌ సర్వీస్‌ ప్రారంభం

Maharashtra: ఫోర్‌ వీలర్‌ వెళ్లలేని చోటుకు బైక్‌ అంబులెన్స్‌

Update: 2023-01-19 05:58 GMT

Maharashtra: మహారాష్ట్రలో బైక్‌ అంబులెన్స్‌ సర్వీస్‌ ప్రారంభం

Maharashtra: మహారాష్ట్రలోని మన్యంలో జీవిస్తున్న ఆదివాసీల కోసం సరికొత్త సేవలను ప్రారంభించింది ప్రభుత్వం. ఆదివాసీ గూడేలకు సరైన రోడ్డు మార్గం లేక పోవడంతో అత్యవసర పరిస్థితిలో అంబులెన్స్‌ వెళ్లలేక వైద్యం అందక చాలా మంది చనిపోయారు దీనిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బైక్‌ అంబులెన్స్‌ సర్వీస్‌ ప్రారంభించింది. బైక్‌ అంబులెన్స్‌లో ప్రథమ చికిత్సకు అవసరమైన మందులు, ఆక్సీజన్‌ సిలిండర్‌, స్ట్రెచర్‌ సౌకర్యం అందుబాటులో ఉంచారు. బైక్‌ అంబులెన్స్‌ డ్రైవర్‌కు ప్రాథమిక చికిత్స చేసేందుకు అవసరమైన శిక్షణ కూడా ఇచ్చారు. బైక్‌ అంబులెన్స్‌ ఆదివాసీ గూడేనికి చేరగానే ముందుగా ఫస్ట్‌ ఎయిడ్‌ చేస్తారు. ఆ తర్వాత దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తారు. హాస్పిటల్‌కు తరలించేటప్పుడు రోగికి ఆక్సీజన్‌ అవసరమైతే ఇవ్వడానికి ప్రతి బైక్‌ అంబులెన్స్‌లో సిలిండర్‌ అందుబాటులో ఉంచారు. ముందుగా ఈ సేవలను తలోదా, నందూర్‌బా జిల్లాల్లో ప్రారంభించారు.

Full View
Tags:    

Similar News