మేనమామతో ప్రేమాయణం .. భర్తను షూటర్లతో చంపించింది..!

Viral News: ఇటీవల సంబంధాలు, ప్రేమ, బంధాలకు విలువ తగ్గిపోతున్న సందర్భాల్లో మరో దారుణ ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది.

Update: 2025-07-03 04:51 GMT

మేనమామతో ప్రేమాయణం .. భర్తను షూటర్లతో చంపించింది..!

Viral News: ఇటీవల సంబంధాలు, ప్రేమ, బంధాలకు విలువ తగ్గిపోతున్న సందర్భాల్లో మరో దారుణ ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. వివాహం జరిగిన కేవలం 45 రోజుల్లోనే ఓ యువతి తన భర్తను హత్య చేయించిందన్న వార్త ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మామ, మేనకోడలు కలిసి చేసిన ఈ దారుణం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లా బర్వాన్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల ప్రియాన్షు, రెండు నెలల క్రితం గుంజా దేవితో వివాహం చేసుకున్నాడు. అయితే, గుంజా దేవికి పెళ్లికి ముందే తన మేనమామ జీవన్ సింగ్ (55)తో ప్రేమ సంబంధం ఉండేది. కుటుంబ సభ్యుల అభ్యంతరంతో వీరిద్దరి వివాహం జరగలేదు. చివరికి గుంజా దేవిని ఆమెకు ఇష్టం లేకుండా ప్రియాన్షుతో పెళ్లి చేశారు.

పెళ్లి తర్వాత గుంజా దేవి భర్తను తోలగించాలని భావించి తన మేనమామతో కలిసి కుట్ర పన్నింది. జూన్ 25న ప్రియాన్షు తన సోదరి ఇంటి నుంచి రైలులో తిరిగి వస్తుండగా, నవీనగర్ స్టేషన్ వద్ద దిగాడు. ఇంటికి తీసుకెళ్లేందుకు బైక్ పంపించాలని భార్యకు ఫోన్ చేశాడు.

ఇక, ముందుగా పన్నిన కుట్ర ప్రకారం… ప్రియాన్షు మార్గమధ్యంలో బైక్‌పై వస్తుండగా ఇద్దరు వ్యక్తులు అతడిని అడ్డగించి కాల్చి హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

హత్య అనంతరం గుంజా దేవి ప్రవర్తన అనుమానం కలిగించింది. ఆమె గ్రామం విడిచి పారిపోవాలని ప్రయత్నించడంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు ఆమె కాల్ రికార్డులు పరిశీలించగా… జీవన్ సింగ్‌తో తరచూ ఫోన్‌లో మాట్లాడినట్లు, అలాగే హత్యకు shooters‌ను సంప్రదించిన ఆధారాలు బయటపడ్డాయి.

ఈ హత్య కేసును ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్టు ఔరంగాబాద్ ఎస్పీ అమ్రిష్ రాహుల్ తెలిపారు. "ప్రియాన్షు, గుంజా దేవిల వివాహం జరిగిన 45 రోజుల్లోనే ఈ దారుణం జరిగింది. కేసులో గుంజా దేవితో పాటు ఇద్దరు షూటర్లను అరెస్ట్ చేశాం. పరారీలో ఉన్న జీవన్ సింగ్ కోసం గాలింపు ముమ్మరం చేశాం" అని వెల్లడించారు.

ఈ ఘటన ఇటీవల మేఘాలయలో చోటుచేసుకున్న మరో ఘటనను గుర్తు చేస్తోంది. హనీమూన్‌కి వెళ్లిన భర్తను భార్య, ప్రియుడితో కలిసి హత్య చేసిన సంఘటన అక్కడ సంచలనం రేపింది. ఇటువంటి ఘటనలు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది.

Tags:    

Similar News