Bihar Counting Updates:బీహార్ లో పోటాపోటీ!

బీహార్ తొలి గంట ఓట్ల లెక్కింపు సరళిలో ఎన్డియే స్వల్ప ఆధిక్యం కనబరిచింది.

Update: 2020-11-10 04:12 GMT

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తొలి గంటలో ఎన్డియే, మహా కూటమి నువ్వా..నేనా అన్న రీతిలో తలపడుతున్నాయి.

ఇక్కడ హసన్‌పూర్‌లో ఆర్జేడీ నేత తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌, రాఘోపూర్‌లో ఆర్జేడీ అధ్యక్షుడు తేజస్వీ యాదవ్‌ ముందంజలో ఉన్నారు. అలాగే ఇమామ్‌గంజ్‌లో మాజీ సీఎం జీతన్‌రాం మాంఝీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మాదేపురాలో పప్పు యాదవ్‌ వెనుకంజలో ఉన్నారు. జోకీపాట్‌లో ఎంఐఎం అబ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

బీహార్ రాష్ట్రవ్యాప్తంగా 38 జిల్లాల్లో 55 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించారు. తరువాత ఈవీఎంలను తెరచి లెక్కింపు ప్రారంభిస్తున్నారు.

తొలి ఆధిక్యాలు ఇలా.. (ఉదయం 9 గంటల వరకూ)

తాజా సమాచారం ప్రకారం పార్టీ వారీగా చూస్తే బీజేపీ 50, జేడీయూ 34, ఆర్జేడీ 52, కాంగ్రెస్‌, 16, ఎల్‌జేపీ 4, ఇతరులు 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 73 స్థానాల్లో ఇంకా ఓట్ల కౌంటింగ్‌ మొదలు పెట్టలేదు.

ఎగ్జిట్‌ పోల్స్‌ కాంగ్రెస్‌, ఆర్జేడీతో కూడిన ప్రతిపక్షకూటమి వైపే మొగ్గుచూపడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం 243 శాసనసభ స్థానాలున్న బిహార్‌లో అధికారంలోకి రావాలంటే 122 సీట్లలో గెలుపొందాల్సి ఉంటుంది.

ఇక మరోవైపు మధ్యప్రదేశ్‌లోనూ 28 శాసనసభ స్థానాల జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపూ జరుగుతోంది. తొలి గంట కౌంటింగ్ సరళి లో బీజేపీ నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు గుజరాత్‌, యూపీ సహా వివిధ రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలకు, బిహార్‌లో వాల్మీకినగర్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది.

Tags:    

Similar News