Bharat Bandh: ఈరోజు భారత్ బంద్‌, సమ్మెలో 25 కోట్ల మంది పాల్గొనబోతున్నారు – ఏవి తెరిచి ఉంటాయి? ఏవి మూతపడతాయి?

Bharat Bandh: ఈరోజు జూలై 9 బుధవారం దేశవ్యాప్తంగా భారత్ బంద్‌ పాటించనున్నారు. పలు కార్మిక సంఘాల పిలుపుతో నిర్వహించనున్న ఈ సార్వత్రిక సమ్మెలో బ్యాంకింగ్, బీమా, పోస్టల్, మైనింగ్, నిర్మాణ రంగాలతో పాటు అనేక రంగాల్లోని సుమారు 25 కోట్ల మంది కార్మికులు పాల్గొనబోతున్నారు.

Update: 2025-07-08 23:14 GMT

ఈ సమ్మెకు కారణంగా ప్రభుత్వంలోని కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసించడమేనని కేంద్ర కార్మిక సంఘాలు తెలిపాయి. ఈ పిలుపునిచ్చిన దశాబ్ద కాలపాటు క్రియాశీలంగా ఉన్న పది ప్రధాన కార్మిక సంఘాల వేదిక, సమ్మెను విజయవంతం చేయాలని ప్రజలను కోరింది.

సమ్మెలో ఎవరు పాల్గొంటున్నారు?

అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (AITUC) నేత అమర్‌జిత్ కౌర్ ప్రకారం, రైతులు, గ్రామీణ కార్మికులు కూడా ఈ ఉద్యమంలో భాగమవుతారని తెలిపారు. యునైటెడ్ కిసాన్ మోర్చా, యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ అగ్రికల్చరల్ వర్కర్స్ యూనియన్స్ ఈ బంద్‌కు మద్దతు ప్రకటించాయి. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పెద్దఎత్తున ఉద్యమాలు జరుగుతాయని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి.

కార్మికుల ప్రధాన డిమాండ్లు ఇవే:

♦ నిరుద్యోగానికి పరిష్కారం, మంజూరైన ఖాళీల్లో తక్షణ నియామకాలు.

♦ కొత్త ఉద్యోగాల సృష్టి.

♦ MNREGAలో పని దినాలు, వేతనాల పెంపు. పట్టణాల్లో కూడా ఇలాంటి పథకాలు ఏర్పాటు చేయాలి.

ఏ రంగాలపై ప్రభావం పడుతుంది?

హింద్ మజ్దూర్ సభకి చెందిన హర్భజన్ సింగ్ సిద్ధూ తెలిపిన వివరాల ప్రకారం, సమ్మె వల్ల ఈ సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది:

♦ బ్యాంకులు

♦ పోస్టాఫీసులు

♦ బొగ్గు గనులు

♦ ఫ్యాక్టరీలు

♦ రాష్ట్ర రవాణా సేవలు

ఏవి నడుస్తాయి?

♦ పాఠశాలలు, కళాశాలలు – సాధారణంగా తెరిచి ఉండే అవకాశం

♦ ప్రైవేట్ కార్యాలయాలు – సమ్మెలపై ప్రభావం తక్కువగా ఉండవచ్చు

♦ రైలు, బ్యాంకింగ్ సేవలపై అస్పష్టత ఉంది. యూనియన్లు ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు

రవాణా ఎలా ఉంటుంది?

బస్సులు, టాక్సీలు, క్యాబ్‌ సేవలు వంటి ప్రజా రవాణా విధానాలు కొంతవరకు తడబడే అవకాశం ఉంది. నగరాలవారీగా పరిస్థితులు మారవచ్చు.

Tags:    

Similar News