ఇవాళ రాజస్థాన్‌లో సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న భజన్‌లాల్‌ శర్మ

Bhajan Lal Sharma: డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేయనున్న దియాకుమారి, ప్రేమ్‌చంద్‌

Update: 2023-12-15 04:36 GMT

ఇవాళ రాజస్థాన్‌లో సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న భజన్‌లాల్‌ శర్మ

Bhajan Lal Sharma: రాజస్థాన్‌ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి రంగం సిద్ధమైంది. జైపుర్‌లోని చారిత్రక ఆల్బర్ట్‌ హాలు వేదికగా ఇవాళ ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మతోపాటు ఉప ముఖ్యమంత్రులు దియాకుమారి, ప్రేమ్‌చంద్‌ బైరవాలు ప్రమాణం చేయనున్నారు. గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా సీఎం, డిప్యూటీ సీఎంలతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.

Tags:    

Similar News