Rajasthan CM: రాజస్థాన్ కొత్త సీఎంగా భజన్‌లాల్ శర్మ

Rajasthan CM: ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే సీఎంగా భజన్‌లాల్ శర్మ

Update: 2023-12-12 13:11 GMT

Rajasthan CM: రాజస్థాన్ కొత్త సీఎంగా భజన్‌లాల్ శర్మ

Rajasthan CM: రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మను బీజేపీ అధిష్టానం నియమించింది. దియా సింగ్, డాక్టర్ ప్రేమ్ చంద్ భైర్వాలను డిప్యూటీ సీఎంలుగా నియమితులయ్యారు. వాసుదేవ్ దేవ్ నాని స్పీకర్ గా వ్యవహరిస్తారని బీజేపీ ప్రకటించింది. సీఎం పీఠం ఎక్కుతున్న భజన్ లాల్ శర్మ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. హేమాహేమీలను కాదని మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్న భజన్ లాల్ శర్మను బీజేపీ అధిష్ఠానం నూతన ముఖ్యమంత్రిగా పేర్కొనడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా, శాసనసభా పక్ష సమావేశంలో భజన్ లాల్ శర్మ పేరును మాజీ సీఎం వసుంధరా రాజే ప్రతిపాదించారు. మిగతా బీజేపీ సభ్యులు ఆమె నిర్ణయాన్ని బలపరిచారు.

Tags:    

Similar News