Bengaluru: ఆహా ఏమి అదృష్టం..కుక్కలకు రెండున్నర కోట్లు ఖర్చుపెట్టి మూడు పూటలా చికిన్ బిర్యానీ..
Bengaluru: అదృష్టం అంటే ఈ కుక్కలదే. ఈ దేశంలో తిండి దొరక్క ఇంకా ఎంతోమంది అల్లాడుతున్నారు.
Bengaluru: ఆహా ఏమి అదృష్టం..కుక్కలకు రెండున్నర కోట్లు ఖర్చుపెట్టి మూడు పూటలా చికిన్ బిర్యానీ..
Bengaluru: అదృష్టం అంటే ఈ కుక్కలదే. ఈ దేశంలో తిండి దొరక్క ఇంకా ఎంతోమంది అల్లాడుతున్నారు. నిత్యం అడుకుంటూ ఇంకా రోడ్లపైన తిరుగుతున్నారు. కానీ ఈ కుక్కలకు మూడు పూటలా చికెన్ బిర్యానీ. అంటే ఇదో ఎవరో డబ్బులున్నవాళ్లు చేస్తున్న పని అనుకునేరు. అసలు కాదు.. బెంగుళూరు అధికారులే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ కుక్కలకు మూడు పూటలా బిర్యానీ పెట్టేందుకు ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసా? కేవలం 2.80 కోట్లు మాత్రమే.
బెంగుళూరు వీధి కుక్కలు ఎక్కువగా ఉంటాయి. పలు నగరాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే వీటికోసం ఇప్పుడు బెంగుళూరు నగర పాలక అధికారులు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. వాటికి నిత్యం మూడు పూటలా చికెన్ బిర్యానీ సరఫరా చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం రూ.2.80 కోట్లతో ఓ పథకాన్ని కూడా సిద్దం చేశారు.
పెంపుడు జంతువులకు ఆస్తులు రాసివ్వడం.. పెళ్లిలు చేయడం మనం చూస్తున్నాం. ఇక వీధి కుక్కల సంగతైతే ఏదో జాలి కలిగి కొంత అన్నం పెట్టడమే కానీ.. ఇలా వాటికోసం పథకాలు తీసుకురావడం ఒకింత ఆశ్చర్యంగానే ఉంది.
బెంగుళూరు నగర పాలక అధికారులు రూ. 2.80 కోట్లతో వీధికుక్కల కోసం ఒక ఆహార పథకాన్ని తీసుకొచ్చింది. ఈ డబ్బుతో మూడు పూటలా కుక్కలకు చికెన్ బిర్యానీ పెట్టాలని నిర్ణయించింది. నగరంలో దాదాపు 2.80 లక్షల వీధి కుక్కలు ఉన్నాయి. వీటికి నిత్యం ఆహారం, నీరు, వసతి కల్పించారు. అయితే ఇప్పుడు ఇంకొంచెం అడుగు ముందుకేసి మూడు పూటలా చికెన్ బిర్యానీ పెట్టాలని అధికారులు నిర్ణయించారు. తొలివిడతగా 5వేల కుక్కలకు ఒక్కోదానికి 367 గ్రాముల చికెన్ బిర్యానీ అందించాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం 125 ప్రదేశాలను గుర్తించారు. అయితే ఈ పథకం అమలు టెండర్లను ఆహ్వానించారు. ఇవ పూర్తయిన తర్వాత ఈ కుక్కలు ఇంక ఎక్కడకీ వెళ్లనవసరం లేకుండా ఒక చోట ఉండి చికెన్ బిర్యానీలు లాంగించొచ్చు.