రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌కు బెంగాల్ ఏంపీల లేఖ

Update: 2020-12-31 04:52 GMT

తమ గవర్నర్‌ను తొలగించాలంటూ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎంపీలు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌కు లేఖ రాశారు. రాజ్యాంగ నియమావళిని ఆయన అతిక్రమించారని ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బీజేపీకి అనుకూల వైఖరి ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. అదేవిధంగా రాజకీయ కక్ష చూపుతున్నారని ఆరోపించారు. ఓ రాష్ట్రానికి రాజ్యాంగ అధిపతి అయిన ఆయన.. ఒక రాజకీయ పార్టీకి బాహాటంగా మద్దతునిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.

ఇంకా శాసన సభ ఆమోదించిన బిల్లులను తొక్కిపెడుతున్నారని స్పీకర్ ను సంజాయిషీలు కోరుతున్నారని అన్నారు. లోగడ బీజేపీ అధ్యక్షుని కాన్వాయ్ పై జరిగిన దాడి నేపథ్యంలో ముఖ్యమంత్రి అపాలజీ చెప్పాలని గవర్నర్ కోరారని ఈ ఎంపీలు ఆరోపించారు.

అయితే ఈ లేఖను బీజేపీ నేతలు తేలిగ్గా కొట్టి పారేశారు. రాష్ట్రపతికి దీన్ని పంపినా దీని ప్రభావం ఏమీ ఉండదని ఈ పార్టీ నేత కైలాష్ విజయ్ వర్గీయ అన్నారు. గవర్నర్ ను చూసి తృణమూల్ కాంగ్రెస్ భయపడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. గవర్నర్ రాజ్యాంగబధ్ధంగానే నడుచుకుంటున్నారని ఆయన చెప్పారు.

రాజ్యాంగ పరిరక్షణలో గవర్నర్‌ వైఫల్యం చెందారని, తక్షణమే ఆయనను పదవి నుంచి తొలగించాలంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తాము సంతకాలు చేసిన మెమొరాండంను రాష్ట్రపతి భవన్‌కు పంపించారు. కాగా పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధంకర్‌, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య గత కొన్నిరోజులుగా విమర్శల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాపై దాడి నేపథ్యంలో ప్రభుత్వాన్ని, పోలీసుల తీరును తప్పుబడుతూ గవర్నర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఔట్‌సైడర్స్‌ అంటూ బీజేపీ నేతలను ఉద్దేశించి మమత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆయన పద్ధతిగా మాట్లాడాలంటూ హితవు పలికారు. అదే విధంగా పోలీసులు తీరును విమర్శిస్తూ ఈ ఘటనకు సంబంధించి కేంద్రానికి నివేదిక సమర్పించారు.

Tags:    

Similar News