PM Modi: ప్రధాని మోడీతో భేటి కానున్న బెంగాల్ సీఎం మమతాబెనర్జీ

PM Modi: ఈనెల 28న మోడీ, మమత భేటీ * రాష్ట్ర ప్రయోజనాల కోసమే అంటున్న తృణమూల్ కాంగ్రెస్

Update: 2021-07-23 01:48 GMT

ప్రధాని మోడీతో భేటీ కానున్న మమతా బనెర్జీ (ఫైల్ ఇమేజ్)

PM Modi: ప్రధాని నరేంద్ర మోడీతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భేటీ కానున్నారు. ఈనెల 28న వీరి భేటీ జరగనుంది. ప్రధాని మోడీతో పాటు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కూడా కలుస్తానని మమతా ప్రకటించారు. కేంద్రంలో పెగాసస్ స్పైవేర్ వివాదంపై రచ్చ జరుగుతున్న నేపథ్యంలో దీదీ ప్రధాని భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. సీఎంగా బాధ్యతలు తీసుకున్న మూడు నెలల తర్వాత మమతా ప్రధానితో భేటీ కానున్నారు. అయితే.. ఇది అధికారిక పర్యటన అని, రాజకీయ పర్యటన కాదని తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రయోజనాల కోసమే ప్రధానితో చర్చించేందుకు వెళ్తున్నారని టీఎంసీ నేతలు పేర్కొన్నారు.

మే నెలలో యాస్ తుఫాను సమయంలో పశ్చిమబెంగాల్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీతో.. మమత వ్యవహరించిన తీరు సంచలనమైంది. వీరిద్దరి భేటీలో మమత ఐదు నిమిషాలు కూడా ఉండలేకపోయింది. అనంతరం ఎన్నికలు జరిగాయి. భారీ మెజారిటీతో గెలిచి మూడోసారి అధికారం చేపట్టింది. సీఎం పీఠం ఎక్కిన ఇన్ని రోజులకు పీఎంను కలవడం పై జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవల బీజేపీపై మమత బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల పెగాసస్ ఫోన్ ట్యాపింగ్‌పై ప్రధాని మోడీ, అమిత్‌ షా పై విరుచుకుపడ్డారు. తన ఫోన్ కూడా కేంద్రం ట్యాప్ చేస్తుందని తీవ్రమైన ఆరోపణాలు చేశారు. అయితే.. దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రధానిని కలవడంపై చర్చ జరుగుతుంది. అనంతరం రాష్ట్రపతిని కలిసి పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ పై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.

ఢిల్లీ పర్యటనలో దీదీ మరికొందరిని కలిసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. వీరితో పాటు ఢిల్లీలో రైతులు చేపడుతున్న ఆందోళనలకు మద్దతు పలకనున్నారు. ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఎంపీలు వ్యవహరించాల్సిన తీరుపై చర్చించే అవకాశం ఉంది. కేంద్రంపై పోరాటం తీవ్రం చేస్తానని మమత ఇప్పటికే ప్రకటించారు. ప్రతిపక్ష నాయకులను కూడా మమత కలిసి చర్చించనున్నారని టీఎంసీ నేతలు చెప్తున్నారు.

Tags:    

Similar News