Karnataka CM 2021: కర్ణాటక సీఎంగా బాధ్యతలు స్వీకరించిన బసవరాజ్ బొమ్మై

Karnataka CM 2021: బసవరాజ్‌తో ప్రమాణం చేయించిన గవర్నర్ థావర్‌చంద్‌ గెహ్లాట్

Update: 2021-07-28 07:05 GMT

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన బసవ రాజు బొమ్మై (ఫైల్ ఇమేజ్)

Karnataka CM 2021: కర్ణాటక సీఎంగా బసవరాజ్ బొమ్మై బాధ్యతలు స్వీకరించారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌.. బసవరాజ్‌తో ప్రమాణం చేయించారు. అంతకుముందు బెంగళూరులోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేసిన బసవరాజ్‌ యడియూరప్పను కలిశారు. యడియూరప్పతో పాటే ప్రమాణస్వీకార కార్యక్రమానికి వచ్చారు. నిన్న జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో యడియూరప్ప బసవరాజ్‌ పేరును ప్రతిపాదించగా ఆయన్ను సీఎంగా ప్రకటించింది బీజేపీ అధిష్టానం.

1960 జనవరి 28వ తేదీన హుబ్లీలో జన్మించిన బసవరాజ్ హుబ్లీలోని బీవీ భూమారెడ్డి ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్ నుంచి డిగ్రీ పట్టా పొందారు. డిగ్రీ పూర్తయ్యాక మూడేళ్ల పాటు టాటా మోటర్స్ గ్రూప్ లో ఇంజినీర్ గా పనిచేశారు. ఆ తర్వాత జేడీయూ నుంచి యువజన సభ్యుడిగా బొమ్మై రాజకీయ రంగప్రవేశం చేశారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 1996లో అప్పటి కర్ణాటక సీఎం జేహెచ్ పటేల్ కు ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2008లో బీజేపీలో చేరి షిగ్గాన్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీ బాధ్యతలు చేపట్టారు. 2008 -2013 కాలంలో నీటి వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా, యడియూరప్ప ప్రభుత్వంలో హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఈనేపథ్యంలో బీజేపీ అధిష్టానం కర్ణాటక సీఎం పీఠాన్ని బసవరాజ్ కు ఖరారు చేసింది. 

Tags:    

Similar News