Banks working days: ఏప్రిల్ 1 నుండి బ్యాంకులు వారానికి 5 రోజులే పని చేస్తాయా?

Update: 2025-03-21 08:11 GMT

Banks working days: ఏప్రిల్ 1 నుండి బ్యాంకులు వారానికి 5 రోజులే పని చేస్తాయా?

PIB fact check on Banks to work 5 days a week news: ఏప్రిల్ 1 నుండి బ్యాంకులు వారానికి ఐదు రోజులే పని చేయనున్నాయా? శనివారం, ఆదివారం బ్యాంకులకు ఇకపై సెలవు దినాలేనా? ఇటీవల కాలంలో కొంతమందిని వేధిస్తోన్న ప్రశ్నలు ఇవి. సాధారణంగా మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేసే వారికి శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో వారికి ఏదైనా బ్యాంకు పనులు ఉంటే శనివారం ఆ పని చూసుకుంటుంటారు.

అయితే, ఇకపై శనివారం బ్యాంకులకు కూడా సెలవు ఉంటే తమ పరిస్థితి ఏంటని వారిలో ఒక సందేహం మొదలైంది. అది కాస్తా సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ సందేహాలకు కారణం ఇటీవల కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో కొంతమంది నెటిజెన్స్ తెలిసి తెలియక చేస్తోన్న ప్రచారమే. కానీ వాస్తవానికి అందులో నిజం లేదు.

ఇదే విషయమై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చపై తాజాగా ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ చేసి (PIB Factcheck) అదంతా ఉత్తి పుకారేనని తేల్చిచెప్పింది. ఆర్బీఐ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏప్రిల్ 1 నుండి బ్యాంకులు వారానికి ఐదు రోజులే పనిచేస్తాయని, శని-ఆదివారాలు బ్యాంకులకు సెలవు ఉంటుందని లోక్‌మత్ టైమ్స్ ప్రచురించిన ఒక వార్తా కథనాన్ని ఉదాహరణగా చూపిస్తూ ఇది ఫేక్ న్యూస్ అని పీఐబి స్పష్టంచేసింది.

"బ్యాంకులకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్ విజిట్ చేయండి" అని ఎక్స్ ద్వారా ఆ లింకును కూడా షేర్ చేసింది. అదండీ అసలు విషయం... బ్యాంకులు ఇకపై వారానికి 5 రోజులే పనిచేస్తాయనే ప్రచారంలో నిజం లేదు. అది ఒక ఫేక్ న్యూస్ మాత్రమే.  

More Interesting stories: మరిన్ని ఆసక్తికరమైన వార్తా కథనాలు

ప్రపంచంలో సంతోషంగా ఉన్న దేశాల్లో ఇండియా, అమెరికా, బ్రిటన్ ర్యాంక్స్ ఎంతో తెలుసా?

కెనడా వచ్చి తప్పు చేశాను... పెద్ద చర్చకు దారితీసిన సోషల్ మీడియా పోస్ట్

సునీత విలియమ్స్ చిన్నప్పటి లక్ష్యం వేరు... చివరకు అయ్యింది వేరు 

Tags:    

Similar News