'జన్‌ధన్‌' నగదు విత్‌డ్రా ఈ తేదీల్లోనే..

Update: 2020-04-02 12:06 GMT

కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పేదలను ఆదుకునేందుకు ప్రధానమంత్రి మోదీ ఇటీవల చేసిన ప్రకటన మేరకు ఏప్రిల్‌ 2న జన్‌ధన్‌ మహిళల ఖాతాల్లో నగదు జమకానుంది. జన్‌ధన్‌ మహిళల ఖాతాల నుంచి నగదు ఉపసంహరణపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఖాతాదారుల రద్దీని అధిగమించేందుకు ఈ ఆంక్షలు పెట్టింది. 

ఖాతా చివరణ 0,1 అంకెలు ఉన్నవారు ఈ నెల 3వ తేదీన నగదు ఉపసంహరించుకోవచ్చు.

ఖాతా చివరణ 2,లేక 3 అంకెలు ఉన్నవారు ఈ నెల 4వ తేదీన నగదు ఉపసంహరించుకోవచ్చు.

ఖాతా చివరణ 4,లేక 5 అంకెలు ఉన్నవారు ఈ నెల 7వ తేదీన నగదు ఉపసంహరించుకోవచ్చు.

ఖాతా చివరణ 6,లేక 7 అంకెలు ఉన్నవారు ఈ నెల 8వ తేదీన నగదు ఉపసంహరించుకోవచ్చు.

ఖాతా చివరణ 8,లేక 9 అంకెలు ఉన్నవారు ఈ నెల 9వ తేదీన నగదు ఉపసంహరించుకోవచ్చు.

ఈ నెల 9వ తేదీ లోపు నగదు తీసుకోలేని వారు నగదును ఎప్పుడైనా తీసుకోవచ్చు. జన్‌ధన్‌ ఖాతాల్లో రూ.500 చొప్పున కేంద్ర ప్రభుత్వం 3 నెలల పాటు జమ చేయనుంది. కేవైసీ పత్రాలు లేవన్న కారణంతో చిన్న ఖాతాలను స్తంభింపజేయవద్దని, వాటిని వెంటనే వాడుకలోకి తీసుకురావాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. కాబట్టి జన్‌ధన్‌ ఖాతా తెరిచిన ప్రతి మహిళా అకౌంట్‌లోనూ రూ.500 చొప్పున నగదు జమ కానుంది. 

Tags:    

Similar News