Aero India 2023: ఏరో ఇండియా ప్రదర్శనకు సిద్ధమైన బెంగళూరు
Aero India 2023: ఏరో ఇండియా ప్రదర్శనకు హాజరుకానున్న 109 దేశాల ప్రతినిధులు
Aero India 2023: ఏరో ఇండియా ప్రదర్శనకు సిద్ధమైన బెంగళూరు
Aero India 2023: భారతదేశ అతిపెద్ద ఏరోస్పేస్, రక్షణ ఎగ్జిబిషన్ 14వ ఎడిషన్ ఏరో ఇండియాని నేడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభిస్తారు. బెంగళూరు శివారు యలహంకలో ఏరో ఇండియా-2023 ప్రదర్శన ప్రారంభం కానుంది. 'ద రన్ వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్' పేరిట ఏరో ఇండియాను నిర్వహించనున్నారు. మేక్ ఇన్ ఇండియా ప్రచారంలో భాగంగా దేశీయ విమాన రంగాన్ని ఈ ప్రదర్శన ఎలివేట్ చేయబోతోంది. ఇది మొత్తం 5 రోజులు జరుగుతుంది. ఇందులో రకరకాల విమానాలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, విమాన రంగ కంపెనీల ఉత్పత్తులు, రక్షణ రంగ ఉత్పత్తుల్ని ప్రదర్శిస్తారు. ఇందులో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి సంబంధించిన EMB-145, Su-30, MIG-29 యుద్ధ విమానాలు ఉన్నాయి.
'భారత్‌లో తయారీ- ప్రపంచ కోసం తయారీ' అనే లక్ష్యాలతో రూపొందించిన భారతీయ రక్షణ రంగ ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. 32 దేశాల రక్షణ మంత్రులు, 73 మంది వివిధ సంస్థల సీఈఓలు పాల్గొంటారు. 17వరకు నిర్వహించే కార్యక్రమంలో 75 వేల కోట్ల ఒప్పందాలు చేసుకోవడానికి వీలుందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.