Bangalore: కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేయడాన్ని నిరసిస్తూ.. నేడు బెంగళూరు బంద్‌

Bangalore: బెంగళూరు బంద్‌కు పిలుపునిచ్చిన ప్రజాసంఘాలు

Update: 2023-09-26 04:46 GMT

Bangalore: కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేయడాన్ని నిరసిస్తూ.. నేడు బెంగళూరు బంద్‌

Bangalore: తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయాలన్న కర్ణాటక ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా రైతు సంఘాలు, కన్నడ అనుకూల సంఘాలు ఆంధోళనలకు దిగుతున్నాయి. ఇవాళ బెంగళూరు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కు అన్ని వర్గాల వారు మద్దతు తెలుపుతున్నారు. నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ బస్సలను ఎక్కడికక్కడ నిలిపివేస్తున్నారు. పోలీసులు భారీగా మోహరించారు.

తమిళనాడుకు 15 రోజుల పాటు రోజుకు 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్ మెంట్ అధారిటీ కర్నాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే నీటిని విడుదల చేయడానికి వీలులేదంటూ కర్నాటకలోని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. దీంతో కర్నాకట ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఇచ్చిన ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో కర్నాటక ప్రభుత్వం నీటిని విడుదల చేయాలని నిర్ణయించుకుంది. దీంతో పలు ప్రజాసంఘాలు బెంగళూరు బంద్ కు పిలుపునిచ్చాయి. 

Tags:    

Similar News