Acharya Satyendra das:అయోధ్య రామమందిర ప్రధాన పూజారి కన్నమూత

అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ కన్నుమూశారు. మధుమేహం, బీపీ కారణంగా ఇటీవల లక్నోలోని ఎస్‌జీపీజీఐ ఆస్పత్రిలో చేరారు.

Update: 2025-02-12 05:38 GMT

అయోధ్య రామమందిర ప్రధాన పూజారి కన్నమూత

Acharya Satyendra das: అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ కన్నుమూశారు. మధుమేహం, బీపీ కారణంగా ఇటీవల లక్నోలోని ఎస్‌జీపీజీఐ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో బుధవారం తుదిశ్వాస విడిచారు. అయోద్య రామాలయ ప్రారంభోత్సవం, బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట సమయంలో సత్యేంద్ర దాస్ కీలక పాత్ర పోషించారు.

1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో సత్యేంద్రదాస్ తాత్కాలిక రామమందిరానికి పూజారిగా ఉన్నారు. కూల్చివేతకు ముందు విగ్రహాలను సమీపంలోని ఫకీరే మందిరానికి తరలించి రామజన్మభూమిలోని తాత్కాలిక ఆలయంలో ఉంచి పూజలు చేశారు. 20 ఏళ్ల వయసులో నిర్వాణి అఖాడాలో చేరి ఆధ్యాత్మిక దీక్ష తీసుకున్నారు.

సత్యేంద్ర దాస్ మృతి పట్ల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలియజేశారు. శ్రీరాముని పరమ భక్తుడు, శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య శ్రీ సత్యేంద్ర కుమార్ దాస్ మరణం చాలా విచారకరం, ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరని నష్టమన్నారు యోగి ఆదిత్యనాథ్.

Tags:    

Similar News