Traffic Challan: వాహనంలో ఇలాంటి మార్పులు చేస్తున్నారా.. భారీగా ఫైన్లు పడే ఛాన్స్.. అవేంటంటే?

Traffic Challan: భారతదేశంలో చాలా మంది రెడ్ లైట్ ఉల్లంఘనలు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వంటివాటితో ప్రమాదాలతోపాటు భారీగా ఫైన్లను ఎదుర్కొంటుంటారు. కాబట్టి, ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి.

Update: 2023-05-22 08:15 GMT

Traffic Challan: వాహనంలో ఇలాంటి మార్పులు చేస్తున్నారా.. భారీగా ఫైన్లు పడే ఛాన్స్.. అవేంటంటే?

How to Avoid Traffic Challan: భారతదేశంలో చాలా మంది రెడ్ లైట్ ఉల్లంఘనలు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వంటివాటితో ప్రమాదాలతోపాటు భారీగా ఫైన్లను ఎదుర్కొంటుంటారు. కాబట్టి, ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి. తెలిసి లేదా తెలియక మీరు ఈ రూల్స్‌ను ఫాలో చేయలేకపోతే.. కచ్చితంగా చలాన్‌ని ఎదుర్కొవాల్సి వస్తుంది. 3 సాధారణ నియమాలను పాటించడం ద్వారా ట్రాఫిక్ చలాన్‌ను నివారించుకోవచ్చు.

1. డ్రైవింగ్ చేసేటప్పుడు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. రహదారిపై ట్రాఫిక్ సిగ్నల్స్, బోర్డులను జాగ్రత్తగా చూసుకోండి. రోడ్లపై ఉన్న సైన్ బోర్డులు మీకు వేగ పరిమితి, అనేక ఇతర సమాచారాన్ని తెలియజేస్తూనే ఉంటాయి. సంభావ్య ట్రాఫిక్ జామ్‌లు, ప్రమాద ప్రాంతాలను గుర్తించి, వాటిని నివారించడానికి అవసరమైన చర్యలు తీసుకోండి. హెచ్చరిక సంకేతాలపై శ్రద్ధ వహించాలి.

2. ట్రాఫిక్ చలాన్‌లను నివారించడానికి RC, పొల్యూషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్‌లను మీ వద్ద ఉంచుకోండి. ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడైనా ఈ పత్రాలను అడిగే ఛాన్స్ ఉంది. మీరు ఈ పత్రాలను మీ మొబైల్ లేదా యాప్‌లో డిజిటల్ రూపంలో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

3. చాలా మంది వ్యక్తులు తమ వాహనం లేదా బైక్‌ను ప్రత్యేకంగా మార్చడానికి సవరణలు చేస్తుంటారు. కానీ అధిక సవరణలు ట్రాఫిక్ చలాన్‌కు దారితీయవచ్చు. వాహనంలో భారీ సౌండ్ ఎగ్జాస్ట్‌ను ఇన్‌స్టాల్ చేయవద్దు. కార్లపై భారీ ధ్వని వినిపించే సెట్టింగ్స్, బ్లాక్ కిటికీలు, ప్రకాశవంతమైన లైట్లు వంటి మార్పులు అనుమతించరు. అయితే, మీరు మీ సౌలభ్యం కోసం లోపలి భాగంలో కొన్ని మార్పులు చేసుకోవచ్చు.

Tags:    

Similar News