TSGRTC Sankranti Special Buses: టీజీఎస్ఆర్టీసీ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు సంక్రాంతి స్పెషల్ బస్సులు – ఈ తేదీల్లో సౌకర్యాలు

హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు సంక్రాంతి పండుగ కోసం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు అందుబాటులో. జనవరి 9 నుండి 13 వరకు అమలాపురం, కాకినాడ, విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, విజయవాడ వంటి జిల్లాలకు సౌకర్యవంతమైన సర్వీసులు. ముందుగా ఆన్‌లైన్ టిక్కెట్లు బుక్ చేసుకోండి.

Update: 2025-12-30 15:23 GMT

సంక్రాంతి పండుగ దగ్గరపడడంతో హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే ప్రయాణికుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఇప్పటికే చాలా మంది రైలు, బస్సు, విమాన టికెట్లను బుక్ చేసుకున్నారు. ప్రైవేట్ బస్సులు ఫుల్ అయ్యాయి, రైల్వే శాఖ కూడా ప్రత్యేక రైళ్లను నిర్వహిస్తోంది. అయితే, టికెట్లు దొరకని ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ ప్రకటించింది.

టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ఆర్టీసీ, సంక్రాంతి కోసం ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు ప్రత్యేక బస్సులు నడుపుతోంది. బీహెచ్ఈఎల్ డిపో మేనేజర్ సుధా ప్రకారం, ఈ ప్రత్యేక బస్సులు జనవరి 9 నుండి 13 వరకు అందుబాటులో ఉంటాయి.

ప్రయాణికులు ముందుగా టీజీఎస్ఆర్టీసీ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవడం అవసరం. ప్రత్యేక బస్సులు హైదరాబాద్ శివారు ప్రాంతాల నుండి అమలాపురం, కాకినాడ, నరసాపురం, విశాఖపట్నం, రాజమండ్రి, పోలవరం, గుంటూరు, చీరాల, విజయవాడ మరియు ఇతర ప్రధాన పట్టణాలను కవర్ చేస్తాయి.

బీహెచ్ఈఎల్(ఆర్‌సీ పురం) డిపో నుండి మియాపూర్, కేపీహెచ్‌బీ, ఔటర్ రింగ్ రోడ్ (ORR) మార్గంలో ప్రయాణం సజావుగా సాగేలా ప్రత్యేక బస్సులు నడపబడతాయి. ట్రాఫిక్ రద్దీని నివారించడానికి, సిటీలో వెళ్లి రాగానే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనకుండా చూడటమే ప్రధాన ఉద్దేశ్యం.

హెల్ప్‌లైన్: 9959226149

ప్రత్యేక రైళ్లు

డక్షిణ మధ్య రైల్వే, సంక్రాంతి పండుగ దృష్ట్యా 11 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇవి జనవరి 7 నుండి 12 వరకు నడుస్తాయి. ముఖ్యమైన రూట్లు:

  • కాకినాడ – వికారాబాద్
  • వికారాబాద్ – పార్వతీపురం
  • పార్వతీపురం – వికారాబాద్
  • పార్వతీపురం – కాకినాడ టౌన్
  • సికింద్రాబాద్ – పార్వతీపురం

ఈ ప్రత్యేక రైళ్లలో 1ఏసీ, 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ కోచ్‌లు, సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. ఏపీ-తెలంగాణ మధ్య ప్రయాణించాలనుకునేవారు ఇప్పుడే బుకింగ్స్ చేసుకోవచ్చు.

Tags:    

Similar News