Saif Ali Khan: సైఫ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌కు రివార్డ్‌

Update: 2025-01-21 09:11 GMT

Saif Ali Khan: బాలీవుడ్ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై జరిగిన దాడి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఖరీదైన ప్రాంతంలో నివాసం ఉంటున్న సైఫ్‌పై దాడి జరగడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. సైఫ్‌పై దాడికి దిగిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం ఆయనను విచారిస్తున్నారు. కేవలం చోరీ కోసమే నిందితుడు సైఫ్ ఇంటిలోకి చొరబడినట్లు విచారణలో తేలింది.

ఇదిలా ఉంటే వేల కోట్లకు అధిపతిగా ఉన్న సైఫ్‌ను ఆసుపత్రికి ఒక ఆటోలో తరించాలరన్న వార్త కూడా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కార్లన్నీ గ్యారేజ్‌లో ఉండడంతో వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించాలన్న ఉద్దేశంతోనే సైఫ్‌ను సాధారణ వ్యక్తిలా ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆటో డ్రైవర్‌ భజన్ సింగ్ రానా చాలా చాకచక్యంగా వీలైనంత త్వరగా ముంబైలోని లీలావతి ఆసుపత్రికి చేర్చారు.

సకాలంలో చికిత్స ప్రారంభించడంతోనే సైఫ్‌ ప్రాణాలు దక్కాయని వైద్యులు కూడా చెప్పారు. ఇలా సైఫ్‌ ప్రాణాలను కాపాడడంలో ఆ ఆటో డ్రైవర్‌ కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ముంబైకి చెందిన ఫైజన్ అన్సారీ అనే సోషల్ వర్కర్ ఆటో డ్రైవర్‌కు రూ. 11 వేల రివార్డును అందించారు. అయితే సైఫ్‌ కుటుంబ సభ్యుల నుంచి ఎవ్వరూ ఇప్పటి వరకు ఆటో డ్రైవర్‌ భజన్ సింగ్ రానాను సంప్రదించినట్లు సమాచారం లేదు.

ఇదిలా ఉంటే పోలీసుల విచారణలో భాగంగా ఆటో డ్రైవర్‌ రానాను కూడా పోలీసులు విచారించారు. రానా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తనకు తెలిసిన వివరాలు వెల్లడించారు. "తాను తీసుకెళ్లిన వ్యక్తి వీపు భాగంలో పూర్తిగా రక్తంతో నిండింది. అతను సైఫ్ అలీఖాన్ అని కూడా తనకు తెలియదు. ఎవరో తీవ్రంగా గాయపడ్డారని అనుకున్నాను. రిక్షా దిగి లీలావతి హాస్పిటల్‌లోకి తీసుకెళుతుండగా ఆయన ముఖం చూశాను. అప్పుడు తెలిసింది సైఫ్ అని. ఆయన ఎవరనే సంగతి పక్కనపెడితే వారిని వీలైనంత వేగంగా ఆస్పత్రికి తీసుకెళ్లేందుకే తాను ప్రాధాన్యత ఇచ్చాను. వీలైనన్ని షార్ట్ కట్స్ తీసుకుని మనిషిని హాస్పిటల్‌కి చేర్చడమే అప్పుడు నా ముందున్న లక్ష్యం. అదే చేశాను. సైఫ్ అలీఖాన్ ఆ రోజు తెల్లటి దుస్తులు ధరించారు. ఆయన సహాయకుడు, కుమారుడు ఇబ్రహీం మాత్రమే సైఫ్‌తో ఉన్నారు" అని తెలిపారు. 

Tags:    

Similar News