రైలు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

Update: 2020-05-08 04:41 GMT

మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా ఛత్తీస్ ఘడ్ కు చెందిన వలస కూలీలు స్వస్థలాలకు చేరుకోవడానికి రైల్వే ట్రాక్ వెంట నడుస్తున్నారు. ఈ సమయంలో శుక్రవారం ట్రాక్‌పై నిద్రిస్తున్న కూలీలపై గూడ్స్ రైలు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 16 మంది వలస కూలీలు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఔరంగబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ హృదయ విదారక ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలా జరగడం అత్యంత విచారకరమని ఆయన ట్వీట్ చేశారు. ఘటనపై రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో మాట్లాడినట్లు తెలిపారు. పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షించాల్సిందిగా తెలిపినట్లు చెప్పారు. కావాల్సిన అన్ని సహాయ, సహకారాలను అందించనున్నట్లు వెల్లడించారు.



 


 

 

Tags:    

Similar News