ఢిల్లీలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నివాసంపై దుండగుల దాడి

* రాజస్థాన్‌ పర్యటన ముగించుకొని ఢిల్లీ వెళ్లకముందే దాడి

Update: 2023-02-20 03:40 GMT

ఢిల్లీలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నివాసంపై దుండగుల దాడి

Asaduddin Owaisi: MIM అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఢిల్లీలోని తన ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారని, ఈ దాడిలో ఇంటి కిటికీలు దెబ్బతిన్నాయని అసదుద్దీన్ ఒవైసీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2014 నుంచి తన ఇంటిపై ఆగంతకులు రాళ్ల దాడి చేస్తున్నారని, ఆదివారం రాత్రి జరిగిన ఈ రాళ్ల దాడి నాల్గవ ఘటన అని అసద్ ట్వీట్ చేశారు. ఆదివారం రాత్రి తాను జైపూర్ నుంచి ఢిల్లీలోని తన ఇంటికి తిరిగిరాగా రాళ్ల దాడి జరిగినట్లు పనివారు చెప్పారని, ఈ దాడిలో పలు కిటికీలు పగిలిపోయాయని ఎంపీ అసద్ ట్వీట్ లో పేర్కొన్నారు. ఎంపీ ఫిర్యాదుతో ఢిల్లీలోని అశోకా రోడ్డులో ఉన్న అసద్ ఇంటిని ఢిల్లీ డీసీపీ సందర్శించి రాళ్ల దాడి ఆధారాలు సేకరించారు. తన ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని సేకరించి రాళ్ల దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ అసద్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News