బెస్ట్ రిటైర్మెంట్‌ స్కీం.. తక్కువ పెట్టుబడి పెట్టండి.. ఎక్కువ పెన్షన్ పొందండి..!

Atal Pension Yojana: ఉద్యోగులు 60 సంవత్సరాలు దాటిన తర్వాత రిటైర్మెంట్ చేయాల్సిందే...

Update: 2022-03-19 06:09 GMT

బెస్ట్ రిటైర్మెంట్‌ స్కీం.. తక్కువ పెట్టుబడి పెట్టండి.. ఎక్కువ పెన్షన్ పొందండి..!

Atal Pension Yojana: ఉద్యోగులు 60 సంవత్సరాలు దాటిన తర్వాత రిటైర్మెంట్ చేయాల్సిందే. అలాగే వ్యాపారం చేసే వ్యక్తి వృద్ధాప్యం కారణంగా సంపాదించలేడు. ఈ పరిస్థితిలో వారికి పెన్షన్ అనేది గొప్ప భరోసా. రిటైర్మెంట్‌ తర్వాత ఇంటి ఖర్చులను భరించడానికి మీరు పెన్షన్ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ రోజు మనం భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న పెద్ద పెన్షన్ పథకం గురించి తెలుసుకుందాం. దాని పేరు అటల్ పెన్షన్ యోజన.

అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడి పెట్టడం వల్ల పెట్టుబడిదారునికి ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది. దీంతో పాటు ఇందులో పెట్టుబడి పెడితే 50 వేల రూపాయల అదనపు పన్ను మినహాయింపు లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు ఈ పథకంలో పెట్టుబడిపై 2 లక్షల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనం పొందుతారు.

అసంఘటిత రంగాల్లో నిమగ్నమై ఉన్న ప్రజలకు వారి భవిష్యత్‌ సురక్షితంగా ఉండేందుకు 2015లో అటన్ పెన్షన్ పథకం ప్రారంభించారు. ఇందులో 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న భారతీయ పౌరులు ఎవరైనా తమ డబ్బును ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. ఒక వ్యక్తికి బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా ఉంటే వారుతమ పెట్టుబడి ఎంపికగా అటల్ పెన్షన్ యోజనను సులభంగా ఎంచుకోవచ్చు.

అటల్ పెన్షన్ యోజనలో నమోదు ప్రక్రియ

1. ఈ పథకంలో రిజిస్ట్రేషన్ కోసం ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://enps.nsdl.com/eNPS/NationalPensionSystem.htmlపై క్లిక్ చేయండి.

2. ఆ తర్వాత APY ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

3. తర్వాత ఆధార్ సమాచారాన్ని నమోదు చేయండి.

4. తర్వాత రిజిస్టర్డ్ నంబర్‌కి వచ్చిన OTPని నమోదు చేయండి.

5. ఈ వెరిఫికేషన్ తర్వాత మీ అటల్ పెన్షన్ యోజన ఖాతా యాక్టివేట్ అవుతుంది.

6. అప్పుడు మీరు ప్రీమియం సమాచారాన్ని అందించి నామినీని వివరాలని అందజేయాలి.

7. తర్వాత మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.

Tags:    

Similar News