Ashok Gehlot: సోనియా గాంధీతో అశోక్ గెహ్లాట్ భేటీ

Ashok Gehlot: ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు రేపు నోటిఫికేషన్

Update: 2022-09-21 12:16 GMT

Ashok Gehlot: సోనియా గాంధీతో అశోక్ గెహ్లాట్ భేటీ

Ashok Gehlot: సోనియా గాంధీతో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ భేటీ అయ్యారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికపై చర్చించారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికకు రేపు నోటిఫికేషన్ వెలువడనుంది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి విముఖంగా ఉండటంతో.. అశోక్ గహ్లోట్ పార్టీ పగ్గాలు అప్పగించాలని సోనియా బావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో బాగంగానే అశోక్ గహ్లోట్ ను ఢిల్లీకి పిలిపించినట్టు తెలుస్తోంది.

వచ్చే నెలలో జరగనున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ పోటీ చేస్తారని ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలోనే పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, అశోక్ గహ్లోట్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత 40-50 ఏళ్లుగా పార్టీలో తాను చాలా పదవులు చేపట్టానని, కాంగ్రెస్ అధిష్ఠానం తనకు అన్నీ ఇచ్చిందని గహ్లోట్ అన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని పార్టీ అప్పగించే బాధ్యతలను నిర్వర్తించడమే ముఖ్యమని గహ్లోట్ స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానం, కార్యకర్తలు తనను కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయాలని కోరితే తప్పకుండా చేస్తానన్నారు. ఒకవేళ సీఎంగా కొనసాగమంటే కూడా అలాగే చేస్తానని తెలిపారు.

చివరి ప్రయత్నంగా అధ్యక్ష పదవికి పోటీ చేయాలని.. తాను, రాహుల్ గాంధీని మరోసారి కోరతానని గహ్లోట్ చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో ఆయన భారత్ జోడో యాత్రలో పాల్గొంటే.. పార్టీకి సరికొత్త అధ్యాయం అవుతుందన్నారు అశోక్ గెహ్లాట్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 17న జరగనున్నాయి. సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఉపసంహరణకు అక్టోబర్ 8వరకు గడువు. ఎన్నికల అనంతరం రెండు రోజుల తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో గాంధీల విధేయుడిగా అశోక్ గెహ్లోట్, పార్టీ సీనియర్ నేత శశిథరూర్ పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

Tags:    

Similar News