Mumbai Drugs Case - Aryan Khan: అక్టోబర్ 7 వరకు ఎన్‌సీబీ కస్టడీకి ఆర్యన్‌ఖాన్
Mumbai Drugs Case - Aryan Khan: ముంబై కోర్టులో డ్రగ్స్‌కేసుపై వాడివేడిగా వాదనలు...
అక్టోబర్ 7వరకు ఎన్‌సీబీ కస్టడీకి ఆర్యన్‌ఖాన్
Mumbai Drugs Case - Aryan Khan: డ్రగ్స్ కేసులో అరెస్టయిన షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు మూడు రోజుల కస్టడీకి అప్పగించింది న్యాయస్థానం. దీంతో అక్టోబర్ 7 వరకు ఎన్‌సీబీ ఆర్యన్‌ను విచారిస్తుంది. అంతకుముందు ముంబై ఖిలా కోర్టులో డ్రగ్స్ కేసుపై వాడివేడిగా వాదనలు జరిగాయి.
ఆర్యన్‌ఖాన్ డ్రగ్స్ తీసుకున్నాడని, క్రూయిజ్‌లో డ్రగ్స్ పార్టీ నిర్వాహకులతో అతడికి ఉన్న సంబంధాలపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని ఎన్‌సీబీ తరపు న్యాయవాది వాదించారు. కాగా అక్టోబర్ 11వరకు ఆర్యన్‌తోపాటు ఫ్రెండ్స్‌ను కస్టడీకి ఇవ్వాలని కోరగా... మూడు రోజుల కస్టడీకి మాత్రమే న్యాయస్థానం అంగీకరించింది.
ఇదిలా ఉంటే ముంబై క్రూయిజ్‌లో ఆర్యన్ పట్టుబడ్డ సమయంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ దొరికినట్టు కోర్టుకు ఎన్‌సీబీ అధికారులు వెల్లడించారు. ఆర్యన్ ఫోన్‌లో, వాట్సాప్ చాట్స్‌లో డ్రగ్స్‌కు సంబంధించి కీలక సమాచారం లభించిందని, ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాతో సంబంధాలు కూడా బయటపడినట్టు వెల్లడించింది.
అందుకే ఆర్యన్‌ను మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని కోర్టుకు ఎన్‌సీబీ తెలిపింది. మరోసారి క్రూయిజ్‌లో జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఎన్‌సీబీ మరో ఎనిమిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించింది.